OTR: మాగంటి బాబును పక్కన పెట్టిన టీడీపీ పెద్దలు.! మాగంటి రాజకీయానికి బ్రేక్ పడినట్టేనా?
- టీడీపీలో మాగంటి బాబుకు ప్రాధాన్యం తగ్గుతోందా?..
- 2024లో ఏలూరు ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నం, నో..
- భార్యకు జడ్పీ పీఠం కోసం తాజా ప్రయత్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ లీడర్, గతంలో కీలక పదవులు నిర్వహించిన ఆయన్ని టీడీపీ అధిష్టానం పొమ్మనలేక పొగ పెడుతోందా? తనను తాను గట్టిగా ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నా… అంత లేదమ్మా అంటూ పార్టీ పెద్దలు చెప్పకనే చెబుతున్నారా? కూరలో కరివేపాకులా వాడేస్తారా అంటూ… ఏ నాయకుడి అనుచరగణం తెగ ఫీలైపోతోంది? ఆయన విషయంలో అసలేం జరుగుతోంది?
మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ బాబు.. పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్రవేసిన మాగంటి కుటుంబ వారసత్వ రాజకీయాల్లో భాగంగా కీలక పదవుల్లో పని చేశారాయన. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఏలూరు ఎంపీగా పదవులు చేపట్టిన ఈ సీనియర్ లీడర్‌కు ఇప్పుడు టిడిపి అధిష్టానం షాక్ ఇచ్చిందా? రాజకీయంగా ఆయన పాత్రను పూర్తిగా తగ్గించేస్తోందా అన్న ప్రశ్నలకు అవును… అలాగే కనిపిస్తోందన్న సమాధానమే వినిపిస్తోంది రాజకీయ వర్గాల నుంచి. 2024 ఎన్నికల్లో ఏలూరు ఎంపీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారాయన. తనకు అవకాశం కల్పించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ అలక పాన్పు ఎక్కారు కూడా. కానీ… కాలం తెచ్చిన మార్పులతో తిరిగి యాక్టివ్ అయిన మాగంటి బాబు… ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ తన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
Also Read
- OTR: మహబూబాబాద్ కాంగ్రెస్‌లో ముసలం.. ఎమ్మెల్యే మురళీ నాయక్‌పై సొంత పార్టీ నేతల గుర్రు!
- OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
- OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
- Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
ఇందులో భాగంగా… ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ టిక్కెట్ తన భార్యకు కేటాయించాలంటూ టీడీపీ అధిష్టానాన్ని అభ్యర్థించారట. తన కుటుంబానికి తప్ప… వేరే ఎవరికీ ఇవ్వబోరన్న నమ్మకంతో కామవరపుకోట మండలం నుంచి ఆయన భార్యతో నామినేషన్ వేయించారు మాగంటి బాబు. అక్కడ సీన్ కట్ చేస్తే…టీడీపీ అధిష్టానం ఆయనకి గట్టి షాకే ఇచ్చిందంటున్నారు. అదే మండలం నుంచి అప్పటికే నామినేషన్ దాఖలు చేసిన చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి కుమార్తె మందలపు జాహ్నవికి బీ ఫామ్ దక్కింది.
దీంతో మాగంటి బాబు పెట్టుకున్న జడ్పీ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. దీంతో… తాజా పరిణామాలను చూస్తుంటే… తెలుగుదేశం పార్టీ తరఫున మోస్ట్ సీనియర్ లీడర్ గా ఉన్న మాగంటి బాబు రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ పడుతుందేమోనన్న సందేహం కలుగుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ మాగంటి చెప్పకుంటూ వచ్చినా… పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడాన్ని చూస్తుంటే.. ఇక ఆయన్ని సైలెంట్‌గా సాగనంపుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా ఎందుకంటే….. గత ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ దక్కనప్పుడు పార్టీ కోసం పని చేయకుండా… కాడి పడేసి వెళ్ళిపోవడం, పార్టీ కార్యక్రమాలకు దూరం జరగడం లాంటివి ఆయనకు మైనస్‌గా మారాయని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు మాగంటి కుటుంబానికి చైర్మన్ పదవి విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే పెదవి విరిచారట. గతంలో గ్రూపు తగదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బాబుకి మళ్లీ ప్రాధాన్యత కల్పిస్తే క్షేత్రస్థాయిలో తిరిగి పాత పరిస్థితులే వస్తాయంటూ గళం వినిపించినట్టు తెలిసింది.
అందుకే మాగంటి బాబు భార్య జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినా.. బీఫామ్ విషయంలో మాత్రం అధిష్ఠానం నుంచి ఆశించిన స్పందన రాలేదని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో జిల్లాలోని యువ నేతల నుంచి ఏలూరు జడ్పీ చైర్మన్ పదవి కోసం గట్టి పోటీ ఉండటంతో…. బాబు భార్య మాగంటి పాపను పక్కన పెట్టి ఉంటారన్న అభిప్రాయం సైతం ఉంది. పదవి కోసం ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులతోపాటు పార్టీని అంటిపెట్టుకున్న నేతల తరఫున బంధువులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో…. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న టీడీపీ అధిష్టానం సీనియర్ లీడర్‌ను పొమ్మనలేక పొగ పెట్టిందన్న మాటలు వినిపిస్తున్నాయి.
అయితే… ఆయన సొంత వర్గం ఆలోచన మరోలా ఉందట. నామినేటెడ్ పదవి ఇస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నా… అందుకు మాగంటి ఒప్పుకోవడం లేదన్నది వాళ్ళ వెర్షన్. అదే సమయంలో పార్టీ లైన్ ఒకలా ఉంటే… ఆయన మరోలా ఆలోచిస్తున్నారన్న విమర్శలు సైతం పెరుగుతున్నాయి. గతంలో ఆయన పాడిన అసంతృప్తి రాగమే ఇపుడు ప్రతికూలంగా మారిందన్న లెక్కలు సైతం ఉన్నాయి. ఎంపీ పదవి ఆశించిన సమయంలో దక్కకపోవడం, ఆ ఫ్రస్ట్రేషన్లో… అధిష్ఠానం నిర్ణయాలను ప్రశ్నించడం వల్ల పార్టీ నాయకత్వంతో దూరం పెరిగిందన్న అనుమానాలే బలంగా ఉన్నాయి. దాంతో…. ఒకప్పుడు అవసరమైన నేత.. ఇప్పుడు అవసరం లేని నాయకుడిగా మారిపోయారా? కూరలో కరివేపాకులా తీసేస్తారా? అంటూ ఆయన అనుచరగణం అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకొందరైతే… మాగంటి రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటూ… టైం బ్యాడ్ అయినప్పుడు అరటి పండు తిన్నా.. పన్ను విరుగుతుందంటూ సెటైర్స్ వేసుకుంటున్నారు. పార్టీ పెద్దల మౌనం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? లేక ఇదంతా పదవుల పంపకంలో జరుగుతున్న సహజ పరిణామమేనా అన్నది తేలాల్సి ఉంది.
తాజావార్తలు
-
OTR: మాగంటి బాబును పక్కన పెట్టిన టీడీపీ పెద్దలు.! మాగంటి రాజకీయానికి బ్రేక్ పడినట్టేనా?
-
OTR: మహబూబాబాద్ కాంగ్రెస్‌లో ముసలం.. ఎమ్మెల్యే మురళీ నాయక్‌పై సొంత పార్టీ నేతల గుర్రు!
-
Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
-
Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
-
Srinidhi Shetty: “త్రివిక్రమ్’ని జీవితాంతం వదలను.. అలా విసిగిస్తూనే ఉంటా!”
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!