సొంత ఇంట్లో అద్దెకున్నట్టు ఫీలవుతున్నారట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికల తర్వాత కొద్ది రోజులు జనసేనకు, వర్మకు వ్యవహారం బాగానే నడిచింది. కానీ... నెమ్మదిగా గ్యాప్ పెరిగింది. చివరికి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే... కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఇష్టపడడం లేదు రెండు వర్గాలు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జనసేన కండువాలు…