Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Ex Mla Thopudurthi Prakash Reddy

Off The Record: అధికారం పోయినా.. ఆ మాజీ ఎమ్మెల్యేకి నోటి దురద తగ్గలేదా..?

Published Date :March 18, 2025 , 10:04 pm
By Sudhakar Ravula
  • వివాదాస్పదంగా తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యలు..
  • కులం రంగు పులుముకున్న మాజీ ఎమ్మెల్యే మాటలు..
  • భగ్గుమంటున్న బీసీ సంఘాలు, క్షమాపణకు డిమాండ్‌..
  • పోలేపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్ళే ప్రయత్నం..
  • శాంతి భద్రతల సమస్య అంటూ ఆపేసిన పోలీసులు..
  • రామగిరి ఎస్సై సుధాకర్‌ యాదవ్‌ టీడీపీ ఏజెంట్‌ ఆని ఆరోపణ..
Off The Record: అధికారం పోయినా.. ఆ మాజీ ఎమ్మెల్యేకి నోటి దురద తగ్గలేదా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: కొన్ని నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా.. అది వివాదాస్పదంగానే మారుతూ ఉంటుంది. అక్కడి నాయకుల రాశి ఫలాలు అలా ఉంటాయని అంటారు కొందరు. ఇంకా కరెక్ట్‌గా మాట్లాడుకోవాలంటే… రాశి ఫలాలు అనేకంటే…. వాళ్ల మాటలు, చేతలు అనడం కెరక్ట్‌ అంటారు ఎక్కువ మంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఇలాంటివి మాత్రం తప్పవు. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి అనంతపురం జిల్లా రాప్తాడు. మొన్నటి వరకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అధికార పార్టీ నేత అడ్డసుడి వ్యవహారాలు అంటూ టీడీపీ నేతలు గట్టిగానే విమర్శించేవారు. ఇప్పుడు తోపుదుర్తి ఓడిపోయాక.. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కులం రంగు పులుముకున్నాయి. మాజీ ఎమ్మెల్యే మాకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాయి బీసీ సంఘాలు.

Read Also: AP Crime: బాలికను 3 రోజులు నిర్బంధించి సామూహిక అత్యాచారం.. 8 మంది అరెస్ట్..

ఇంతకీ ఏం జరిగిందంటే… ఈనెల 13న రామగిరి మండలం పోలేపల్లిలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. అందులో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రకాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం నుంచి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేని కనగానపల్లి మండలం దాదులూరు దాటిన తర్వాత ధర్మవరం డిఎస్పీ, సీఐ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా అక్కడికి వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో… వారితో వాదనకు దిగారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మామూలుగా అయితే…. మ్యాటర్ అక్కడితో ముగిసిపోవాలి. కానీ… ఆ మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. గతంలో ఒక వ్యక్తిని టీడీపీ వారు కొడితే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అడ్డుకున్నారు.. ఇప్పుడు దేవుడి గుడి వద్దకు వెళ్తున్నా.. అనుమతులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఖాకీ బట్టలు వేసుకున్న పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా? లేదంటే టిడిపి నేతల కోసం పని చేస్తున్నారా? అంటూ ఫైరైపోయారు. అంతవరకు కూడా ఓకే అనుకున్నా… దానికి కొనసాగింపుగా అన్న మాటలలు మాజీ ఎమ్మెల్యేని ఇరికించినట్టు చెప్పుకుంటున్నారు. రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌ టిడిపి ఏజెంటుగా పని చేస్తున్నారంటూ ఆరోపించారాయన. అలాగే పలు సందర్భాల్లో ఎస్ఐ సుధాకర్‌ యాదవ్‌ పేరు ప్రస్తావిస్తూ.. ఇదేమైనా మీ నాయన జాగీరా? అంటూ విరుచుకపడ్డారు. అక్కడే క్యాస్ట్‌ టర్న్‌ తీసుకుంది వ్యవహారం. రామగిరి ఎస్ఐ యాదవ్ కావడంతో… బీసీ సంఘాలు సీన్ లోకి వచ్చారు. విధి నిర్వహణలో ఉన్న బీసీ ఎస్ఐని దుర్భాషలాడి ప్రకాష్‌రెడ్డి తన కుల అహంకారం చూపించుకున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని, మరోసారి ఇలాంటి మాటలు వస్తే…. సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు బీసీ నాయకులు. అలాగే అనుచిత వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్‌ చేశారు.

మూడు రోజుల్లో క్షమాపణ చెప్పకుంటే…. బీసీ సంఘాల ఆధ్వర్యంలో తోపుదుర్తి ఇంటిని ముట్టడిస్తామని కూడా వార్నింగ్‌ ఇచ్చారు. డ్యూటీలో నిబద్ధతతో ఉన్న పోలీసు అధికారిని అవమానించడం ముమ్మాటికి అప్రజాస్వామికమంటూ ఫైరైపోతున్నారు బీసీ లీడర్స్‌. ఎన్నికల సమయంలో మా ఓట్ల కోసం తిరిగిన రోజులు మర్చిపోయారా? ఏరు దాటాక తెప్ప తగలేస్తారా అంటూ మండి పడుతున్నారట. ఇదంతా గమనిస్తున్న వాళ్ళు మాత్రం… కాలం కలిసిరాకుంటే… తాడే పామై కరుస్తుంది. ఆ సంగతి మర్చిపోయి… ఒళ్ళు తెలియకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుందని అంటున్నారట. ఇప్పుడు అధికారంలో లేమన్న సంగతి గుర్తుంచుకుని ఆ నోటి దురదకు కాస్త మందు రాసుకుంటే బెటరని కూడా సలహాలిస్తున్నారట తోపుదుర్తికి. అలా చేయకుంటే తోపుదుర్తి టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అంటూ…. రాష్ట్రం మొత్తం తిరగాల్సి ఉంటుందని కూడా సెటైర్స్‌ వేస్తున్నారు కొందరు. ఈ మాజీ ఎమ్మెల్యే కంట్రోలవుతారా? రాష్ట్ర పర్యటన చేస్తారా అన్నది ఆయనే తేల్చుకోవాలని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Ex MLA Thopudurthi Prakash Reddy
  • off the record
  • Thopudurthi Prakash Reddy
  • YSRCP

తాజావార్తలు

  • US-Iran Conflict: పెరిగిన ‘‘పిజ్జా ఆర్డర్లు’’.. ఇరాన్‌పై బిగ్ యాక్షన్‌కు అమెరికా సిద్ధం..?

  • Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!

  • Reliance Industries: పాపం అంబానీ.. ఒక్కరోజులో రూ.82 వేల కోట్లు లాస్! కారణం ఇదే..

  • MP Kavya: గడ్డి మందుపై నిషేధం విధించాలి.. లోక్‌సభలో ఎంపీ కావ్య డిమాండ్..

  • PM Modi: రేపు దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్న మోడీ

ట్రెండింగ్‌

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions