Koti Deepotsavam 2026 : కోటి దీపాల వెలుగుల్లో వైభవంగా కపాలీశ్వర స్వామి కల్యాణం.!
- స్వామీజీ అనుగ్రహ భాషణం
- వైభవంగా కోటిరుద్రాక్షల అర్చన
- కపాలీశ్వర స్వామి కల్యాణం
- కనులపండువగా నంది వాహన సేవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2026 : భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 వేడుకల్లో 16వ రోజు ఆదివారం (నవంబర్ 29, 2026, కార్తిక బహుళ షష్ఠి) కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాయంత్రం 5:30 గంటల నుంచి ఆధ్యాత్మిక వాతావరణం, భక్తి పారవశ్యం మధ్య సాగిన ఈ వేడుకల్లో అనుగ్రహ భాషణం, ప్రవచనామృతం, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవం, వాహన సేవ వంటి ఘట్టాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
ప్రవచనామృతం.. స్వామీజీల అనుగ్రహ భాషణం
వేడుకల్లో భాగంగా కర్ణాటకలోని శ్రీరంగపట్నం చంద్రవనాశ్రమం ప్రతినిధి శ్రీ శ్రీ త్రినేత్ర మహంత శివయోగి మహాస్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం అందించారు. మహాస్వామీజీ ఆధ్యాత్మిక సందేశంతో పాటు డాక్టర్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనామృతం భక్తులను ఆకట్టుకుంది.
Also Read
- Aus vs Eng: మిచెల్ మార్ష్ సెంచరీ వృథా.. 7 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్ కైవసం..
- Mohammad Kaif: సిరాజ్‌ను ఎందుకు తప్పించారు..? టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్..
- Kieron Pollard: ‘పాత్రలు మాత్రమే మారాయి, లక్ష్యం ఒక్కటే’.. రోహిత్ శర్మ రీఎంట్రీపై పొలార్డ్ రియాక్షన్..
- Delimitation: లోక్‌సభ సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమన్న రాహుల్.. బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న స్టాలిన్
కోటిరుద్రాక్షల అర్చన.. మహేష్ భగవత్ ప్రశంసలు
వేదికపై నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భాగంగా గంగాధరుడికి కోటిరుద్రాక్షల అర్చన అత్యంత వైభవంగా జరిగింది. మరోవైపు భక్తులచే శివలింగాలకు రుద్రాక్షల అర్చన నిర్వహించారు. కార్తిక మాసంలో పరమశివుడికి ప్రీతిపాత్రమైన రుద్రాక్షలతో సాగిన పూజలు భక్తులకు విశేష అనుభూతిని పంచాయి. సప్తహారతులు, లింగోద్భవం కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కోటి దీపోత్సవం నిర్వహణను కొనియాడారు.
శ్రీ కపాలీశ్వర స్వామి కల్యాణోత్సవం.. నంది వాహన సేవ
ఈ రోజు వేడుకల్లో ప్రధాన ఘట్టంగా చెన్నై – మైలాపూర్ శ్రీ కపాలీశ్వర స్వామి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నెమలి రూపంలో పార్వతీదేవి తపమాచరించిన క్షేత్రంగా, బ్రహ్మ ప్రతిష్ఠిత శివలింగం కొలువై ఉన్న క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన స్వామివారి కల్యాణ వేడుకతో పాటు నంది వాహన సేవ కూడా కనులపండువగా సాగింది.
కోటిదీపోత్సవం-2026, 16వ రోజు ఉత్సవంలో భాగంగా మైలాపూర్ శ్రీ కపాలీశ్వర స్వామి కల్యాణోత్సవం..
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/YOSBtwqXcv
— BhakthiTV (@BhakthiTVorg) November 29, 2026
కోటిదీపోత్సవం-2026 16వ రోజు ఉత్సవంలో భాగంగా ప్రాంగణంలో మధ్యలో ఉన్న బంగారు శివలింగం వద్ద 108 మందిచే పంచహారతులు..
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/H69McUVfkh
— BhakthiTV (@BhakthiTVorg) November 29, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపాల వెలుగుల్లో వైభవంగా కపాలీశ్వర స్వామి కల్యాణం.!
-
Aus vs Eng: మిచెల్ మార్ష్ సెంచరీ వృథా.. 7 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్ కైవసం..
-
Mohammad Kaif: సిరాజ్‌ను ఎందుకు తప్పించారు..? టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్..
-
Gond Laddu: చలికాలంలో ఆడపిల్లలు, బాలింతలు తినాల్సిన ‘సూపర్ లడ్డూ’ ఇదే!
-
Old Silk Sarees : పాత పట్టు చీరల్లో బంగారం, వెండి.. ఎలా గుర్తించాలి.?
ట్రెండింగ్
-
Rooftop Solar Net : ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఉన్నాయా?.. మిగులు యూనిట్లతో ఇక మరింత ఆదా.!
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!