Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
- పొగ కనిపిస్తే వెంటనే ఏం చేయాలి?
- పొగ రంగుతో సమస్య అంచనా
- ఇంజిన్ నుంచి పొగకు కారణాలు
- చేయకూడని తప్పులివే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కారు నడుపుతున్నప్పుడు అకస్మాత్తుగా హుడ్ లేదా బోనెట్ నుంచి పొగ రావడం కనిపిస్తే ఎవరికైనా కంగారు కలగడం సహజం. కారుకు మంటలు అంటుకుంటాయా లేక ఇలాగే నడపడం సురక్షితమేనా అనే ఆలోచనలు వెంటనే వస్తాయి. అయితే ఇలాంటి పరిస్థితిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్రమైన నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఇంజిన్ వేడెక్కడం, ఆయిల్ లేదా కూలెంట్ లీక్ కావడం, లేదా ఎలక్ట్రికల్ లోపం తలెత్తడం వంటి వాటికి ఇది సంకేతం కావచ్చు. ఈ క్లిష్ట సమయంలో తొలి కొన్ని నిమిషాలు ఎంతో కీలకం కాబట్టి, ప్రశాంతంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
పొగ కనిపించినప్పుడు మొదటగా చేయాల్సింది ఇదే
కారు హుడ్ నుంచి పొగ వస్తున్నట్లు గమనించగానే కంగారు పడకుండా, వాహనాన్ని రోడ్డు పక్కన సురక్షితమైన ప్రదేశంలో నిలపాలి. వెంటనే హజార్డ్ లైట్లను ఆన్ చేసి, ఇంజిన్‌ను ఆఫ్ చేయాలి. అనంతరం కారులో ఉన్న వారందరినీ కిందకు దించి, సురక్షితమైన దూరానికి తీసుకెళ్లాలి. ఈ దశలో వెంటనే హుడ్ తెరవడానికి ప్రయత్నించకూడదు. ఇంజిన్ వేడిగా ఉన్నప్పుడు లోపల ఆవిరి, అధిక వేడి ఉంటాయి కాబట్టి హుడ్ తెరిస్తే వేడి ఆవిరి ముఖంపై పడటం లేదా మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఇంజిన్ చల్లబడటానికి 15 నుంచి 30 నిమిషాల వరకు సమయం పట్టవచ్చు. దట్టమైన పొగ లేదా మంటలు కనిపిస్తే వాహనం దగ్గరకు వెళ్లకుండా వెంటనే అత్యవసర సహాయ సేవలను సంప్రదించాలి.
Also Read
- Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
- Kidney Health Foods: కిడ్నీ ఆరోగ్యానికి వరం లాంటి ఆహారాలు ఇవే.. ప్రయోజనాలు ఎన్నో!
- Healthy Winter Recipes: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బలం.. చలికాలంలో తినాల్సిన హెల్తీ లడ్డూను నిమిషాల్లో చేసుకోండి!
- Calcium-Rich Foods: పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం.. రోజుకు కొంచెం తిన్నా ఎముకలు ఉక్కులా మారతాయి!
పొగ రంగును బట్టి సమస్య అంచనా
కారు బోనెట్ నుంచి వచ్చే పొగ రంగును గమనిస్తే సమస్య స్వభావంపై కొంత అవగాహన వస్తుంది. తెల్లటి పొగ వస్తుంటే అది కూలెంట్ లీక్ లేదా ఇంజిన్ అధిక వేడికి సంకేతం కావచ్చు. నీలం లేదా బూడిద రంగు పొగ వస్తే ఇంజిన్ ఆయిల్ ఎక్కడో లీక్ అయి వేడి భాగాలపై పడి కాలిపోతోందని అర్థం చేసుకోవచ్చు. అదే నల్లటి పొగ వస్తుంటే ఇంధన సరఫరా లేదా ఇంజిన్‌లో లోపం ఉందని భావించాలి.
బోనెట్ నుంచి పొగ రావడానికి ప్రధాన కారణాలు
ఇలాంటి పరిస్థితికి ఇంజిన్ వేడెక్కడం అత్యంత సాధారణ కారణంగా నిలుస్తుంది. కూలెంట్ స్థాయి తగ్గడం, పైపులు పగలడం, రేడియేటర్ లేదా వాటర్ పంప్లో సమస్యలు తలెత్తడం వల్ల ఇంజిన్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేడిగా ఉన్న ఇంజిన్ భాగాలపై ఆయిల్ కారినా పొగ వస్తుంది. కొన్ని సందర్భాల్లో విద్యుత్ లోపాలు కూడా కారణమవుతాయి. వైరింగ్ లేదా ప్లాస్టిక్ భాగాల్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడితే అవి కాలిపోయి పొగ బయటకు వస్తుంది.
ఈ తప్పులు అస్సలు చేయవద్దు.. సురక్షిత మార్గం ఏమిటి?
వేడిగా ఉన్న ఇంజిన్‌పై ఎప్పుడూ చల్లటి నీటిని పోయకూడదు. వేడిగా ఉన్న లోహ భాగాలపై ఒక్కసారిగా చల్లటి నీరు పడితే అవి దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే దగ్గరే కదా అని పొగ వస్తున్నప్పటికీ కారును అలాగే నడపడం చాలా ప్రమాదకరం. దీనివల్ల చిన్న సమస్య కాస్తా పెద్ద ఇంజిన్ వైఫల్యంగా మారవచ్చు. అందువల్ల పొగ వచ్చినప్పుడు డ్రైవింగ్ ఆపి, సురక్షిత ప్రదేశంలో నిలిపి, అవసరమైతే మెకానిక్ సహాయం తీసుకోవడమే సరైన పద్ధతి.
తాజావార్తలు
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Election Results: ఏపీ రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. కూటమి మద్దతుదారుల జోరు..
-
Mohammed Shami: షమీ పొలిటికల్ ఎంట్రీ?.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో షమీ భేటీ..
-
Abbas: 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి అబ్బాస్ రీఎంట్రీ..?
-
Nero Teaser Controversy: ప్రమోషన్ల కోసమా.. జనాల అటెన్షన్ కోసమా.. ఆ హీరో చేసింది కరెక్టేనా?
ట్రెండింగ్
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!