Off The Record: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మరీ… అందుకు సంబంధించిన దిశా నిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఈ నెల రెండు నుంచి మొదలైన కార్యక్రమాన్ని ఖచ్చితంగా నెల రోజుల పాటు సిన్సియర్‌గా నిర్వహించాలన్న ఆదేశాలున్నాయి పార్టీ పెద్దల నుంచి. ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు….ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు వాళ్లకు అందుతున్నాయా, లేదా… ప్రభుత్వ పనితీరు ఏరకంగా ఉంది? సర్కార్ మీద సంతృప్తి ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అందుకే ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నారట సీఎం. గతంలో తాను చేసిన పాలన వేరు, ప్రస్తుతం పరిస్థితులు వేరన్నట్టుగా ఉన్న క్రమంలో… ఈసారి ఏడాది పాలనపై కచ్చితమైన ఫీడ్ బ్యాక్ కోరుకోవడంతో పాటు చేసినదాన్నిచెప్పుకోవడంపై దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. అంత ప్రాధాన్యం ఉన్నందునే… ఇంటింటికి కార్యక్రమాన్ని ఆయన ప్రత్యేకంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. అందుకే… ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికి వెళ్తున్నారా లేక ఇంట్లోనే ఉండి మమ అనిపిస్తున్నారా…. అనే విషయం మీద డీటెయిల్డ్ నివేదికలు తెప్పించుకుంటున్నట్టు సమాచారం.
Read Also: YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు..? జగన్ సంచలన వ్యాఖ్యలు
దీనికి సంబంధించి ఏ రోజుకారోజు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ సీఎం టేబుల్ మీదికి వెళ్తోందట. ఎవరు ఎక్కువగా జనంలో ఉంటున్నారు… ఏ ఎమ్మెల్యే ఎక్కువగా తిరుగుతున్నారు? కేవలం మొక్కుబడిగా తిరగడంతోనే సరిపెడుతున్నారా, లేక ప్రభుత్వం చేసిన మంచి గురించి కూడా చెబుతున్నారా? ప్రజలు మంచి చెప్పినా, చెడు చెప్పినా… ఎవరెవరు శ్రద్ధగా వింటున్నారు లాంటివన్నీ వివరాలు వివరాలుగా నోట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని పబ్లిక్ ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నారట. యాక్టివ్ ఎవరు? యాక్టింగ్‌లో ఉన్నదెవరన్న డీటెయిల్డ్ రిపోర్ట్ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతోందన్నది సచివాలయ వర్గాల మాట. ప్రతి ఎమ్మెల్యే సరిగా ప్రతి ఇంటికి వెళ్తున్నారా… లేదా… అక్కడ ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు .. జనాలతో ఎంత దగ్గరగా ఇంట్రాక్ట్ అవుతున్నారన్న విషయం మీద కూడా నివేదిక తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది కాలంగా జరిగిన పాలనకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఫీడ్ బ్యాక్ చాలా ముఖ్యమని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. భవిష్యత్తు కార్యాచరణ మీద దృష్టి పెట్టడానికి ఈ ఫీడ్ బ్యాక్ చాలా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పరిపాలనాపరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయన్నది అధికార కూటమి నేతల అభిప్రాయం.
Read Also: Rajnath Singh: 2026 ఆగస్టులోపే నక్సల్స్ను తుడిచిపెట్టేస్తాం..
అందుకే ఇప్పుడు సరైన ఫీడ్ బ్యాక్ వస్తే… దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ముందు అవసరమైన మార్పులు చేసుకోవాలన్న అభిప్రాయంలో పెద్దలున్నారన్నది టీడీపీ ఇన్నర్ వాయిస్. అందుకే… ప్రధానంగా ఇంటింటికి ఎమ్మెల్యేలను పంపుతున్నట్టు చెబుతున్నారు. సీరియస్‌గా తీసుకోకుండా…. ఇప్పుడుగనుక ఈ కార్యక్రమాన్ని చూసీ…. చూడనట్టు వదిలేస్తే అసలు జనం ఏమనుకుంటున్నారో పూర్తిగా తెలిసే అవకాశం లేదని… భావిస్తున్నారట. అందుకే రెగ్యులర్ గా జరిగే సర్వేలతో పాటు ప్రత్యేకించి నెల రోజులు పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు జనంలో తిరిగి జరిపే అభిప్రాయ సేకరణను కీలకంగా భావిస్తున్నట్టు సమాచారం. అందుకే… ఒక్కో ఎమ్మెల్యే ఎంతవరకు వెళుతున్నారు? ఎన్ని ఇళ్లలో ఎంతమందిని కలుస్తున్నారు? మంత్రులు కూడా భేషజాలకు పోకుండా…అదే పని చేస్తున్నారా అన్న విషయంలో సీఎం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.