Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Ap Secretariat And Ministers Offices

Off The Record: ఏపీ సచివాలయంలో ఏదేదో జరిగిపోతోందా..? మంత్రుల శాఖల్లో ఓఎస్డీలదే ఇష్టారాజ్యమా..!

Published Date :May 16, 2025 , 10:00 pm
By Sudhakar Ravula
  • ఏపీ సచివాలయంలో ఏదేదో జరిగిపోతోందా?..
  • కొందరు మంత్రుల ఓఎస్డీలు, పీఎస్‌ల ఇష్టారాజ్యమైపోయిందా?..
  • విచ్చలవిడి వసూళ్ళు, లెక్కలేనితనం?..
  • కొందరు ఓఎస్డీలు మంత్రుల్ని సైతం లెక్క చేయడం లేదా?..
  • ఒక మంత్రి ప్రైవేట్‌ అసిస్టెంట్‌ హోటల్‌ కేంద్రంగా సెటిల్‌మెంట్స్‌?..
  • మరో శాఖలో మంత్రి కంటే ఓఎస్డీ హవానే నడుస్తోందా?..
  • చేతిలో కీలక శాఖలున్నా ఓఎస్డీకే అప్పగించేశారా?..
  • గతంలో డూప్లికేట్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పించిన పేషీ సిబ్బంది..
Off The Record: ఏపీ సచివాలయంలో ఏదేదో జరిగిపోతోందా..? మంత్రుల శాఖల్లో ఓఎస్డీలదే ఇష్టారాజ్యమా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. కానీ… ఈ ఏడాదిలో గతంలో ఎన్నడూలేని పరిస్థితి కనిపిస్తోందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు సెక్రటేరియెట్‌కు వచ్చే విజిటర్స్‌తో పాటు… సొంత పార్టీ కార్యకర్తలు, సిన్సియర్ అని పేరున్న కొందరు అధికారులు సైతం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారట. కొంత మంది మంత్రుల దగ్గర పని చేసే ఓఎస్డీలు, పీఎస్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నది వాళ్ళందరి కంప్లయింట్‌. విచ్చలవిడి వసూళ్ళు, ఎవర్నీ లెక్కచేయకపోవడం, అంతా మా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించడం లాంటి రకరకాల అవలక్షణాలతో మంత్రుల పేషీలను భ్రష్టుపట్టిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సదరు ఓఎస్డీలు, పీఎస్‌లు కొన్ని సందర్భాల్లో మంత్రులను సైతం పక్కదారి పట్టిస్తున్నారన్న ప్రచారం ఉంది. గవర్నమెంట్‌కు బాగా ఆదాయం తెచ్చిపెట్టే ఒక ప్రధాన శాఖ గురించి అయితే… అసలు మాట్లాడుకో కూడదన్నట్టుగా ఉందట వ్యవహారం. సదరు మంత్రి గారికి ఒక ప్రైవేట్ అసిస్టెంట్ ఉన్నారట. ఓ హోటల్ కేంద్రంగా ఆయనే సెటిల్ మెంట్స్‌ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: Samantha : మాకు సినిమా చూపించడానికి అమ్మ చాలా కష్టపడింది

అన్ని చోట్ల కాకున్నా… ఎక్కడ ఎక్కువ ఆదాయం ఉంటుందో ఆ శాఖల్లో ఈ రకమైన పరిస్థితి ఉందట. భూ లావాదేవీలు కావచ్చు, సెటిల్ మెంట్స్‌ కావచ్చు… ఏవైనాసరే…. ఈ మంత్రి గారి ప్రైవేట్ సిబ్బంది, ఓఎస్డీ చక్కబెట్టేస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఇంకో శాఖలో అయితే…. ఓఎస్డీదే ఇష్టారాజ్యంగా నడుస్తోందని అంటున్నారు. మంత్రికంటే ఎక్కువగా ఆయనే అంతా తానై నడిపించేస్తున్నట్టు సమాచారం. ఆ మంత్రి దగ్గర కీలక శాఖలున్నాయి. అయినాసరే…. మూల విరాట్‌కు ముసుగు కప్పేసి… ఉత్సవ విగ్రహమే మొత్తం నడిపించేస్తోందని అంటున్నారు. ఇక్కడ పెత్తనం మొత్తం ఓఎస్డీదేనట. ఇదే శాఖలో పని చేయడానికి గతంలో ఒకరికి డూప్లికేట్ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్ కూడా ఇప్పించిన ఘనత ఈ పేషీ అధికారులది. కొంత మంది మంత్రులు రెప్రెజెంటేషన్ లెటర్స్‌ కూడా ఇవ్వట్లేదట. అందుకు బదులు వారి ఓఎస్డీలే తమ పేరుతో వివిధ శాఖల అధికారులకు రికమండ్ చేస్తూ లెటర్లు ఇస్తున్నట్టు సమాచారం. దీంతో.. టీడీపీ హయాంలో గతంలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇదేంటోనని మాట్లాడుకుంటున్నాయి అధికార వర్గాలు. కనీసం ఆరేడుగురు మంత్రుల ఓఎస్డీల పరిస్థితి అత్యుత భయంకరంగా ఉందన్నది ఇంటర్నల్‌ టాక్‌. ఒక్కో సందర్భంలో వాళ్ళు తమ మంత్రులను కూడా డామినేట్ చేస్తున్నట్టు సమాచారం. అలాంటి వాళ్ళలో ఉత్తరాంధ్ర మంత్రులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.

Read Also: Samantha : మాకు సినిమా చూపించడానికి అమ్మ చాలా కష్టపడింది

ఇక రాయలసీమకు చెందిన ఒక మంత్రి ప్రైవేట్‌గా మనుషులను పెట్టుకుని మరీ వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు సమాచారం. ఆదాయం వచ్చే ఆ శాఖలో రకరకాల మార్గాల్లో సెటిల్మెంట్స్‌ జరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. వీటన్నిటికీ మించి కొన్ని సందర్భాల్లో ఒక శాఖ మంత్రి ఇచ్చిన లెటర్‌ను మరో మంత్రి పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నారట. సీఎం ఎంత చెప్పినా కొంత మంది మంత్రులు మారడం లేదని, కాస్త సాఫ్ట్‌ మినిస్టర్స్‌ ఉన్న చోట్ల ఓఎస్డీలు, పీఎస్‌లదే ఇష్టారాజ్యమైపోయిందని మాట్లాడుకుంటున్నారు ఏపీ సచివాలయంలో. అలా ఇష్టారాజ్యంగా ఉంటున్న అధికారుల లిస్ట్‌ ప్రభుత్వం దగ్గర ఉందని, వాళ్ళని మారుస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా… కార్యాచరణ మాత్రం లేదు. మొత్తంగా టీడీపీ హయాంలో ఇలాంటి పరిస్థితులు మాత్రం ఇదే ఫస్ట్‌ టైం అని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ముఖ్యమంత్రి దీనికి ఎలా చెక్‌ పెడతారో చూడాలి మరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Ministers
  • AP Secretariat
  • off the record
  • tdp

తాజావార్తలు

  • SS Rajamouli: ప్రపంచ సినిమాను ఏలబోతున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా దిశను మార్చబోతున్న జక్కన్న!

  • US-Iran Talks: చర్చలకు ముందే ఇరాన్ విజయం.. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అమెరికా ఓకే..

  • Indian Players Struggle: ఈ భారత స్టార్ ప్లేయర్లకు ఏమైంది?.. ఐపీఎల్ 2026లో తడబడుతున్న టాప్ స్టార్స్!

  • Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!

  • Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions