Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే కాషాయ కండువా కప్పుకోవాలని తహతహలాడుతున్నారా..?
- రెండు సార్లు అలంపూర్ ఎమ్మెల్యేగా అబ్రహం..
- త్వరలో బీజేపీలో చేరబోతున్నారన్న టాక్..
- గత అసెంబ్లీ ఎన్నికల్లో అబ్రహంకు టిక్కెట్ ఇవ్వని బీఆర్‌ఎస్..
- కాంగ్రెస్‌లో చేరినా క్రియాశీల రాజకీయాలకు దూరం..
- స్థానిక ఎన్నికలకు ముందే బీజేపీలోకి?..
- 2009లో మొదట కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు..3 2018లో బీఆర్‌ఎస్ తరపున రెండోసారి విజయం..
- రెండు సార్లు టిక్కెట్ దక్కకుండా చల్లా దెబ్బ కొట్టారన్న డౌట్..
- అలంపూర్‌లో బీజేపీకి పట్టుందన్న లెక్కలు..
- కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం కూడా బీజేపీ వైపు?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అలంపూర్ నియోజకవర్గం రాజకీయ మలుపుల్లో ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటోంది. ఎవరు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది…. టికెట్ల పంపిణీ వరకు సస్పెన్స్ గానే ఉంటోంది గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి. ఈ క్రమంలో…. రెండు సార్లు అలంపూర్ ఎమ్మెల్యేగా పని చేసిన అబ్రహం… ఈసారి పార్టీ మారి కాషాయ కండువా కప్పుకోబోతున్నారన్న వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని, ఎమ్మెల్సీ చల్లా సూచించిన విజయుడికి టికెట్ ఇచ్చింది బీఆర్‌ఎస్. తనకో, లేదా తన కుమారుడు అజయ్‌కో గులాబీ టికెట్ దక్కుతుందని భావించిన అబ్రహంకు ఈ పరిణామాలు అస్సలు నచ్చలేదట. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కు మద్దతిచ్చారు. అయినా సంపత్ ఓడిపోయారు. ఇక… అసెంబ్లీ ఎన్నికల తరువాత క్రియాశీల రాజకీయాలతో టచ్ మీ నాట్ అన్నట్లు ఉంటున్న అబ్రహం…, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీ లో చేరాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్ చేజారిన తర్వాత బీజేపీ నుంచి పిలుపు వచ్చినప్పుటికీ అప్పుడాయన నిరాకరించారట. కానీ… ఇప్పుడు నియోజకవర్గంలో మారుతున్న పరిస్థితులు, అనుచరగణం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
Read Also: Off The Record: ఆ జనసేన ఎమ్మెల్యే అనుచరులకు ఏం చేసినా పర్శంటేజ్ ఇవ్వాల్సిందేనా..?
Also Read
2009లో రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే… మొదట కాంగ్రెస్ నుంచి టిక్కెట్ దక్కించుకొని గెలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు కాకుండా… సంపత్ కుమార్‌కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో అప్పుడాయన టీడీపీ చేరి ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇక 2018 ఎన్నికల ముందు బి అర్ ఎస్ లో చేరి మరోసారి విజయం సాధించారు. ఇక 2023లో సిట్టింగ్‌గా మరోసారి ఆయనకు టిక్కెట్ దక్కలేదు. ఐతే కాంగ్రెస్ లోనూ , బి అర్ ఎస్ లోనూ సిట్టింగ్‌గా తనకు టికెట్ దక్కకుండా చేయడం లో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారట అబ్రహం. ఇదిలా ఉంటే… వయోభారంతో ఉన్న డాక్టర్ అబ్రహం… బీజేపీ గూటికి చేరాలని ఆలోచించడం వెనక ప్రత్యేక కారణాలున్నాయని చెప్పుకుంటున్నారు. అలంపూర్‌లో బీజేపీకి పట్టు ఉండటం, జనరల్ స్థానంగా ఉన్నప్పుడు బీజేపీ అభ్యర్థులు గెలిచిన ట్రాక్ ఉండటంతోపాటు మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ సెగ్మెంట్‌లో బీజేపీకి 55 వేల పైచిలుకు ఓట్లు రావడంలాంటి లెక్కలు వేసుకుంటున్నారట ఆయన. బీఆర్ఎస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా ప్రాబల్యం, కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే సంపత్ హవా నే కొనసాగుతుండటంతో…. జాతీయ పార్టీ అయిన బీజేపీలో భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నారట అబ్రహం.
Read Also: Real Estate Scam: సొంతిటి కలలు కనే వారే టార్గెట్.. రియల్ ఎస్టేట్‌లో కొత్త తరహా మోసాలు..
ఇక ఇదే సమయంలో కుమారుడు డాక్టర్ అజయ్ పొలిటికల్ కెరీర్ ను దృష్టిలో ఉంచుకొని కూడా బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అబ్రహం ఇప్పటికే జిల్లా బీజేపీ నాయకురాలు, ఎంపీ డీకే అరుణతో, రాష్ట్ర పార్టీ పెద్దలతో భేటీ అయినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల ముందే అబ్రహంను పార్టీలోకి చేర్చుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారట బీజేపీ పెద్దలు. మొత్తం మీద తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం అబ్రహం వేస్తున్న పొలిటికల్ స్టెప్స్ తో అలంపూర్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.
- Tags
- Alampur
- bjp
- BRS
- congress
- ex MLA Abraham
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..