అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అక్కడ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష చేయబోతున్నారా? పార్టీ.. ప్రభుత్వం లైన్ దాటి రాజకీయాలు చేస్తున్న వారి లెక్కలు తేల్చేస్తారా? ఈ బాధ్యతను పార్టీలో కీలక నేతకు అప్పగించడంతో శాసనసభ్యులు అలెర్ట్ అయ్యారా? ఎక్కడో.. ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. అంతర్గతంగా నాయకత్వం మధ్య అనైక్యత పెరుగుతోందా?ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. ఇక్కడ సమీకరణాలు.. సీట్లు.. ఓట్లు అధికార-విపక్షాలకు అత్యంత కీలకం. ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో టీడీపీదే హవా.…