Off The Record: తెలంగాణ రాజకీయాల్లో… మరో వారసత్వానికి తెర లేస్తోందా? మంత్రి కుమార్తె ఒకరు డైరెక్ట్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? స్థానిక ఎన్నికల రిజర్వేషన్ ఆమెకు కలిసొచ్చిందా? జిల్లా పరిషత్‌లో రాజకీయ ఓనమాలు దిద్దుకోవాలనుకుంటున్న ఆ వారసురాలు ఎవరు? ఎక్కడ పోటీ చేయబోతున్నారు?
Read Also: North Korea: అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదు.. అమెరికాకు గట్టి దెబ్బే!
సంగారెడ్డి జడ్పీ పీఠం ఈసారి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. దీంతో.. దీనిపై ఆశలు పెట్టుకున్న ఇతర సామాజిక వర్గాల నేతలు డీలా పడ్డారు. నిన్న మొన్నటి దాకా.. ఇక తాము జిల్లా పరిషత్ ఛైర్మన్స్ అయిపోయినట్టేనని కలలుగన్నవాళ్ళంతా.. ప్రస్తుతం గాలి తీసిన బెలూన్స్‌లా అయిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పని చేసిన నేతలకు జడ్పీ ఆశలు కల్పించాయి రాజకీయ పార్టీలు. అలాగే, జంపింగ్ లీడర్స్ కూడా చాలా మంది ఆశావహులుగా ఉన్నారు. తీరా ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో తమ ఆశల మీద నీళ్లు చల్లినట్టైందని భావిస్తున్నారట వాళ్ళంతా. ఈ జెడ్పీ ఛైర్మన్ పదవి రెండు దశాబ్దాల కిందట ఎస్సీకి రిజర్వు అయింది. మళ్లీ ఇప్పుడు ఆ కోటాలోకి వెళ్ళింది. దీంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున కొత్త పేరు తెర మీదికి వస్తోంది. బరిలో నేను అంటూ.. వారసురాలు దూసుకురావడం ఆసక్తికరంగా మారింది.
Read Also: Chennai Accident: చెన్నైలో ఘోరం.. తొమ్మిది మంది మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
అయితే, సంగారెడ్డి జిల్లాలో అందోల్, జహీరాబాద్ రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్నాయి. అందోల్ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ తలపడుతున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన దామోదర… ప్రస్తుతం రేవంత్ కేబినెట్లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూతురు త్రిష కూడా కొన్నేళ్లుగా పొలిటికల్‌గా యాక్టివ్ గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రికి మద్దతుగా ప్రచారం నిర్వహించారామె. రాజనర్సింహ గెలుపులో త్రిష కీలకపాత్ర పోషించారన్న టాక్ ఉంది అందోల్ నియోజకవర్గంలో. సెగ్మెంట్ అంతా తిరుగుతూ తండ్రి గెలుపునకు తనవంతు ప్రయత్నాలు చేశారు. త్రిషకు ప్రధానంగా యువత, మహిళా ఓటర్లల్లో క్రేజ్ ఉందన్నది లోకల్ టాక్. ఈ క్రమంలోనే.. ఇప్పుడు జెడ్పీ ఛైర్పర్సన్ రేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Read Also: Piyush Goyal: చంద్రబాబు మా పెద్దన్న.. కేంద్రమంత్రి గోయల్ కీలక వ్యాఖ్యలు..
కాగా, కాంగ్రెస్ పార్టీ ఆమెను బరిలోకి దించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తండ్రి కోసం ప్రచారం చేసినా… ఇన్నాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు త్రిష. కానీ… ఈసారి మాత్రం జడ్పీటీసీగా పోటీచేసి డైరెక్ట్ కావచ్చన్ని తెలుస్తోంది. అందోల్ నియోజకవర్గం పరిధిలోని చౌటకూర్ గానీ, మునిపల్లి జెడ్పీటీసీగాగానీ పోటీ చేస్తారనే చర్చ స్థానికంగా మొదలైంది. ఈ రెండు మండలాలు కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాలు. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు కోసం పెద్దగా కష్టపడాల్సిన, డౌట్ పడాల్సిన అవసరం ఉండబోదని అంచనా వేస్తున్నారట మంత్రి రాజనర్సింహ. అటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దామోదర మాటను కాదనే అవకాశం లేకపోవడంతో కుమార్తె ప్రత్యక్ష రాజకీయ ప్రవేశానికి ఇదే కరెక్ట్ టైమని అనుకుంటున్నారట మంత్రి.
Read Also: Tilak Verma: రేవంత్‌రెడ్డిని కలిసిన తిలక్ వర్మ.. సీఎంకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తిలక్..
ఇక, సంగారెడ్డి జిల్లాలో మొత్తం 26 జెడ్పిటిసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 13 చోట్ల గెలిచిన పార్టీకే చైర్మన్ పీఠం దక్కుతుంది. ఆ లెక్కన చూసుకుంటే… అందోల్ నియోజకవర్గంలోనే 6 మండలాలు ఉన్నాయి. ఇది కూడా తమకి కలిసివచ్చే అంశమని భావిస్తోంది దామోదర శిబిరం. మరికొంతమంది నాయకులు కూడా ఈ సారి తమ వారసులను బరిలో దింపే ప్లాన్‌లో ఉన్నా… రిజర్వేషన్లు తారుమారు అవ్వడంతో త్రిషకు మాత్రం లైన్ క్లియర్ అయినట్టు తెలిసింది. మొత్తంగా జిల్లాలో ఆరు మండలాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. చౌటకూర్, మునిపల్లి, మనూరు, సంగారెడ్డి, కొండాపూర్, జహీరాబాద్ జడ్పీటీసీలను ఎస్సీలకు కేటాయించారు. వీటిలో గెలిచిన ఒకరికి చైర్మన్ పదవి దక్కనుంది. మంత్రి దామోదర కూతురు త్రిష పోటీలో ఉండటం ఖాయమై పోవడంతో… ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశం ఉందన్నది విశ్లేషకుల వాయిస్.