సంగారెడ్డి జిల్లాలో అందోల్, జహీరాబాద్ రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్నాయి. అందోల్ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ తలపడుతున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన దామోదర... ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.
రాష్ట్ర మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
Damodar Raja Narasimha: గాంధీ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకస్మిక తనిఖీ చేశారు. గాంధీ ఆసుపత్రి లోని సుపరిoటేండెంట్ కార్యాలయం చేరుకున్నారు.
317 జీవోపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో 9 ప్రభుత్వ శాఖలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు వారి శాఖల పరంగా పూర్తి సమాచారం ఇవ్వనందున యుద్ధ ప్రాతిపదికన పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కమిటీ చైర్మన్ దామోదర్…