OTR: డిండి నీటి కేటాయింపులతో రాజకీయ వేడి.. నల్లగొండ నేతల మౌనమేంటి?
- డిండి ప్రాజెక్టుకు ఎదుల నుంచి నీటి కేటాయింపుపై వివాదం..
- రెండు జిల్లాల నేతల మధ్య అగ్గి రాజేసిన నీటి కేటాయింపు ..
- ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాల నేతల మధ్య డైలాగ్ వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపు వివాదం రెండు జిల్లాల నేతల మధ్య అగ్గి రాజేసిందా?ఈ వివాదంలో ఆ జిల్లా నేతలు ఎందుకు నోరు మెదపడంలేదు?ఆ సీనియర్ నేత ఒక్కరు మాత్రమే ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు?అసలు… ఆయన యాక్షన్ ఎంటి?దానికి వచ్చిన రియాక్షన్ ఏంటి?ప్రతిపక్ష పార్టీనే ఇంతటి వివాదానికి కారణమా?అధికార పార్టీ నేతల మౌనానికి కారణం ఏంటి?
నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందిస్తోంది డిండి ప్రాజెక్టుకు. ఈ ప్రాజెక్టుకు 0.6 టీయంసీలను ఎదుల నుండి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది పాలమూరు-నల్లగొండ జిల్లాల మధ్య జల వివాదానికి కారణమైందని తెలుస్తోంది. ఎదుల నుంచి నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టుకు సాగునీటిని విడుదల చేస్తే పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుందని అంటున్నారట ఆ జిల్లా నేతలు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్ష, అధికార పార్టీ నేతలు ఆందోళన బాటపట్టారు.
Also Read
డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపు వివాదంగా మారినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా రెండు జిల్లాల అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దానికి దారీతీసింది. డిండి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను వ్యతిరేకిస్తూ..ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాలమూరు జిల్లా అధికార నేతలు ప్రభుత్వంపై గట్టిగానే ఒత్తిడి తీసుకువస్తున్నారట. క్యాబినెట్లో రెండు జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. సుదీర్ఘ కసరత్తు తరువాతే ప్రభుత్వం రెండు జిల్లాల రైతుల ప్రయోజనాలు కాపాడేలా క్యాబినెట్లోఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక…ప్రభుత్వ నిర్ణయంపై మహబూబ్నగర్ జిల్లా నేతలు ప్రజల్లోకి వెళ్లారు. రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తూ ఒత్తిడి తెస్తున్నారు. ఇదే సమయంలో నల్లగొండ జిల్లా నేతల మౌనం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందట. ముఖ్యంగా అధికార పార్టీ నేతల మౌనం ఎవరికీ అంతుబట్టడం లేదని తెలుస్తోంది. డిండి ప్రాజెక్టుతో ఎక్కువ లబ్ధి పొందేది దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజలే. ఇలాంటి సమయంలో అధికార పార్టీ నేతల వైఖరి ప్రజలకు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని టాక్.
ఐతే…దీనిపై దేవరకొండ, మునుగోడు ఎమ్మెల్యేలు…పాలమూరు జిల్లా నేతల అభ్యంతరాలను ఎందుకు తిప్పికొట్టడంలేదని విపక్షం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం వద్ద తమ వాదనలకు ఎందుకు వినిపించడంలేదని అడుగుతోంది బీఆర్ఎస్. క్యాబినెట్ నిర్ణయాన్ని పాలమూరు జిల్లా అధికార పార్టీ నేతలే సవాల్ చేస్తుంటే…ఎందుకు నల్లగొండ జిల్లా అధికార పార్టీ నేతలు స్పందించడంలేదని అంటున్నారు. పాలమూరు జిల్లాలో ఉద్యమం రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుంటే.. సాగు నీటిలో హక్కును కాపాడుకునే ప్రయత్నం కూడా చేయకపోవడాన్ని తప్పుపడుతుంది ప్రతిపక్ష బీఆర్ఎస్.
ఈ క్రమంలోనే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. పాలమూరు జిల్లా నేతలతో పాటు కొందరు మేధావులు డిండి ప్రాజెక్టుకు నీటి కేటాంపును వ్యతిరేకించడాన్ని తప్పుపట్టారు. రెండు జిల్లాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా నేతలు వ్యవహారించొద్దని హితవు పలికారు. గత ప్రభుత్వం కృష్ణా నది ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. ఎదుల వద్ద అదనపు మోటర్లు ఏర్పాటు చేస్తే వివాదం సద్దుమణిగే చాన్స్ ఉందని సూచించారట. గుత్తా రియాక్షన్ తర్వాత కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల నేతలు స్పందించలేదని సమాచారం. పాలమూరు జిల్లా నేతలు మాత్రం గుత్తాపై మరింత సీరీయస్గా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. గుత్తా వ్యాఖ్యలు బీఆర్ఎస్ తరపున మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయంటూ కీలక కామెంట్ చేసారు.
మొత్తంగా డిండి ప్రాజెక్టు వ్యవహారంలో నల్లగొండ జిల్లా అధికార పార్టీ నేతలు..సరిగ్గా స్పందించలేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూలో అధికార పార్టీని ఇరుకునే పెట్టడంలో బీఆర్ఎస్ విఫలమైందనే అభిప్రాయం వినిపిస్తోంది. డిండి వాటర్ వార్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇక్కడ తగ్గితే అక్కడ నెగ్గగలమా అనే టెన్షన్ రాజకీయ పార్టీల్లోనూ నెలకొంది.
తాజావార్తలు
-
OTR: డిండి నీటి కేటాయింపులతో రాజకీయ వేడి.. నల్లగొండ నేతల మౌనమేంటి?
-
Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
-
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
-
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
-
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్తో ఇలా
-
Google Jobs: గూగుల్లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..