ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని డిండి ప్రాజెక్ట్ వద్ద వరద ఉధృతి పెరిగింది. డిండి ప్రాజెక్ట్‌కు దుందుభి నది నుంచి భారీగా వరద నీరు చేరుతోంది.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ల కంటే సమర్థవంతంగా పని చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని.. బీఆర్ఎస్ వాదనలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చెప్తామన్నారు. మిగులు జలాల వాడకం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, కోయిల్ సాగర్…