‘జాగృతి జనం బాట’లో భాగంగా నల్లగొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో తన ఫ్లెక్సీలను తొలగించడంపై స్పందించారు. ఫ్లెక్సీలు తొలగించడానికి కవిత తప్పు పట్టారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పెద్ద మంత్రి అనుకున్నా అని విమర్శించారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను తాను ప్రస్తావిస్తున్నా అని, చేతనైతే ప్రభుత్వం సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. నల్లగొండకు కల్వకుంట్ల…
Nalgonda: నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులపై రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Nalgonda Road Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరవక ముందే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కెట్పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి..
Nalgonda: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. భావి పౌరులుగా తయారు చేయాల్సిన ఉపాధ్యాయులే దారితప్పుతున్నారు. తమ ఇంట్లో కంటే పాఠశాలలోనే ఉంటూ ఉపాధ్యాయులతో విద్యార్థులు తమ అనుబంధాన్ని పెంచుకుంటారు. బాలికలు తమకు చదువు నేర్పే గురువులను తమ తండ్రిలాగా భావిస్తారు. కానీ కొందరు టీచర్లు వెకిలి చేష్టలతో గురువులపై ఉండే గౌరవం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. అలాంటి ఓ కీచక గురువు.. విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Komatireddy Venkat Reddy : నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఓ ఉదంతం కలకలం రేపింది. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, సమయస్ఫూర్తితో స్పందించిన స్థానికులు అతడిని వెంటనే అడ్డుకున్నారు. సమాచారం అందిన వెంటనే టూ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. COVID-19: ‘‘స్ట్రాటస్’’ రూపంలో మళ్లీ తిరిగి వచ్చిన కోవిడ్-19.. పోలీసుల ద్వారా అతడి వివరాలు తెలియగా,…
వ్యాపారం ప్రమోషన్ కోసం తమ నెంబర్లను సోషల్ మీడియాతో పాటు ఎక్కడపడితే అక్కడ పెడితే ఇబ్బందులు ఎదుర్కొక తప్పవు.. ఒక వ్యాపారవేత్తకు ఇదే అనుభవం ఎదురయింది.. వ్యాపారవేత్తకు ఫోన్ చేసి వ్యాపార విషయాలు అడిగి చివరకు తక్కువ ధరికే బంగారం ఇప్పిస్తామని చెప్పి కోటి రూపాయలను కొట్టేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఓ రియల్టర్ వ్యాపారాభివృద్ధి కోసం తన పేరు, ఫోన్ నెంబర్ కార్యాలయంపై రాసుకోవడమే శాపమైంది. అలా లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా…
Bhatti Vikramarka : నగరంలోని సైబర్ గార్డెన్‌లో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.…
BRS : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) నేతృత్వంలో నల్గొండలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాజకీయ వాతావరణంలో కలకలం రేగింది. జనవరి 21న జరగాల్సిన ఈ మహాధర్నాకు చివరి నిమిషంలో అనుమతి రద్దయింది. పోలీసుల నిర్ణయంతో బీఆర్ఎస్ నాయకత్వం హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ధర్నాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు…
Nalgonda Govt Hospital: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నల్లగొండ ప్రభుత్వాసుపత్రి మెటర్నటీ డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ శిశువు భూమ్మీదికి రాకముందే మృతి చెందింది. నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కడుపులోనే శిశువు చనిపోయింది. దాంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. Also Read: Dengue Fever: డెంగ్యూతో 12 ఏళ్ల బాలిక మృతి! నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల నల్లగొండ ప్రభుత్వాసుపత్రి డ్యూటీ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నొప్పులు భరించలేని ఆ…