Site icon NTV Telugu

Off The Record: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక కోసం గులాబీ పార్టీ స్కెచ్ మార్చిందా..?

Jubli Hills

Jubli Hills

Off The Record: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం గులాబీ స్కెచ్‌ మారుతోందా? గతానికి భిన్నంగా కొత్త అస్త్రాలకు పదును పెడుతోందా? నియోజకవర్గంలోని కీలక ఓట్‌ బ్యాంక్‌ విషయంలో ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకుంటోందా? అసలిక్కడ బీఆర్‌ఎస్‌ టార్గెట్‌ ఎవరు? కొత్తగా అనుసరించబోతున్న వ్యూహం ఏంటి? ఎంతవరకు సక్సెస్‌ అయ్యే అవకాశం ఉంది?..

Read Also: Box ofice : బాక్సాఫీసు పై స్టార్ హీరోల దండయాత్ర!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అందుకే నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగవేయాలన్న ప్లానింగ్‌లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటును ఎలాగైనా కొట్టాలని అధికార పార్టీ ప్లాన్‌ చేస్తుంటే…తాము గెలిచిన సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ సీటు కాబట్టి మా దమ్మేంటో చూపించాలని ఆరాటపడుతున్నారట కాషాయ నేతలు. ఇక సిట్టింగ్ స్థానం తమదే కాబట్టి.. కచ్చితంగా గెలిచి తీరాలని బిఆర్ఎస్ కూడా స్కెచ్ వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక తర్వాత సంగతి… ముందు నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాల మీద దృష్టి పెట్టాలనుకుంటోందట గులాబీ అధిష్టానం. జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో మూడున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

Read Also: Drugs Racket Busted: మల్నాడ్ రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ‘ఈగల్ టీం’ దూకుడు.. 9 పబ్స్పై కేసు నమోదు!

అయితే, వీరిలో లక్షా 25 వేల మందికి పైగా ముస్లిం మైనార్టీలే. గెలుపు ఓటముల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించేది కూడా వీళ్ళే. అందుకే వాళ్ళని ప్రభావితం చేయగలిగిన అన్ని అంశాల మీద బీఆర్ఎస్‌ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే.. పార్టీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో.. ఓ స్పెషల్‌ మీటింగ్‌ నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న లక్షా 25వేల మంది మైనార్టీ ఓటర్లకు హైదరాబాదులోని మిగతా సెగ్మెంట్స్‌లోని వాళ్ళతో కూడా సంబంధాలు ఉంటాయి కాబట్టి… సిటీలో ఉన్న మిగతా మైనార్టీ నాయకులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేసేలా గులాబీ పెద్దలు ప్లాన్‌ చేస్తున్నారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో కాంగ్రెస్, 2014లో టిడిపి, 2018, 2023లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రతి ఎన్నికలోనూ ముస్లిం మైనారిటీల ఓట్లే కీలకంగా మారాయి. గతంలో ఎంఐఎంతో దోస్తీ ఉన్న సమయంలో ఆ పార్టీ సపోర్ట్‌తో పొలిటికల్‌ స్కెచ్‌లు వేసింది బీఆర్‌ఎస్‌. సాధారణంగా మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటారని, ఆ ఓట్లను చీల్చేందుకు మజ్లిస్‌ పార్టీ అభ్యర్థిని పోటీచేయించి బీఆర్ఎస్‌ సక్సెస్‌ అయిందని చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. జూబ్లీహిల్స్‌ మైనార్టీ ఓటర్లలో చీలిక ద్వారా.. అప్పట్లో కారు పార్టీ తేలిగ్గా గెలవగలిగిందన్నది వాళ్ళ అభిప్రాయం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్‌.

Read Also: Modi-Trump: అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి.. భారత వాణిజ్య శాఖ వెల్లడి

ఇక, రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాక.. ఎంఐఎం వైఖరి కూడా మారిపోయింది. ప్రస్తుతం పతంగి పార్టీ కాంగ్రెస్‌కు దగ్గరగా ఉంది. దీంతో ఈసారి ఔట్‌రైట్‌గా అధికార పార్టీకి సపోర్ట్‌ చేయవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని ముందే గ్రహించినందునే.. బీఆర్‌ఎస్‌ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌ పరిధిలోని ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌, ఎంఐఎంలవైపునకు మళ్లకుండా.. తమకే మొగ్గేలా జాగ్రత్త పడుతున్నారట గులాబీ పెద్దలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉన్న షేక్‌పేట, రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ , యూసుఫ్ గూడ డివిజన్స్‌లో మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అందుకే.. ఆయా ప్రాంతాల్లోని ముస్లిం నాయకులతో ముందు నుంచే మీటింగ్స్‌ పెట్టి.. మచ్చిక చేసుకునే పని మొదలు పెట్టిందట. ముస్లిం ఓట్లలో సింహభాగాన్ని గనుక రాబట్టుకోగలిగితే.. జూబ్లీహిల్స్‌లో తమకు తిరుగుతు ఉండదన్నది బీఆర్‌ఎస్‌ అధిష్టానం అంచనా. కాంగ్రెస్‌, ఎంఐఎంలను కాదని వాళ్ళు ఎంత వరకు కారుకు సపోర్ట్‌ చేస్తారన్నది చూడాల్సిందేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version