YCP : ప్రజాప్రతినిధి కేసులో ఆ ఎమ్మెల్యే చక్రం తిప్పాలని చూశారా.? అభిమానంతో అడ్వాన్స్ అయ్యారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల 19న డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. మధ్యలో ఆ నాలుగు రోజులపాటు ఎమ్మెల్సీ పెళ్లిళ్లు, పేరంటాలుకు తిరుగుతూ పెద్ద హంగామానే చేశారు. అరెస్ట్ తర్వాత అనంతబాబు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ సమయంలో ఎమ్మెల్సీ మాట్లాడిన కాల్స్ వ్యవహారంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ నాలుగు రోజుల్లో అనంతబాబు ఎక్కువగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో మాట్లాడారట.
చంటిబాబు జగ్గంపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఈ నియోజకవర్గం నుంచి జ్యోతుల నెహ్రూ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరారు. ఆ సమయంలో జగ్గంపేట టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న చంటిబాబును వైసీపీలోకి తీసుకురావడంలో అనంతబాబు ఫుల్ సపోర్ట్ చేశారట. తర్వాత జరిగిన ఎన్నికల్లో చంటిబాబుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం.. ఆయన ఎమ్మెల్యే కావడం చకచకా జరిగిపోయింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. చంటిబాబు.. నెహ్రూ.. అనంతబాబు ముగ్గురూ బంధువులే. నాడు రాజకీయంగా సపోర్ట్ చేయడం.. బంధువు కావడంతో అనంతబాబు కేసులో ఇరుక్కున్నప్పుడు చంటిబాబు యాక్టివ్ రోల్ పోషించినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. అదేదో చిన్న కేసు అనుకుని తనస్థాయిలో చక్కబెట్టేద్దామని ఎమ్మెల్యే అభిప్రాయపడినట్టు టాక్. కానీ.. చివరకు చిరిగి చేట అవ్వడంతో కక్కలేక మింగలేక ఉన్నారట చంటిబాబు.
Also Read
కేసులో నుంచి ఎలా బయటకు రావొచ్చు.. అనపర్తి స్పెషల్ బ్రాంచిలో పనిచేస్తున్న ఒక అధికారిని మధ్యలో ఉంచి మొత్తం క్లియర్ చేస్తానని అనంతబాబుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడటానికి పిక్చర్ ప్రిపేర్ చేశారట. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లడంతో.. అనవసర విషయాల్లో తలదూర్చొద్దని ఎమ్మెల్యేకు ఆదేశాలు వెళ్లాయట. దాంతో ఆ హెల్పింగ్ ఎపిసోడ్‌కు అక్కడితో బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. అయితే కేసు విచారణలో భాగంగా పోలీసులు పిన్ టు పిన్ అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు. అందుకే అప్పట్లో జరిపిన ఫోన్ సంభాషణపై ఎమ్మెల్యే ఇప్పుడు బెంగ పెట్టుకున్నారట.
హత్య కేసుతో సంబంధం లేకపోయినా.. ఆ సమయంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేయకుండా ఉండాల్సింది అని ఇప్పుడు బాధపడుతున్నారట ఎమ్మెల్యే. మరీ అడ్వాన్స్ అయిపోయామా అని ఆంతరంగికుల చర్చల్లో ఆరా తీస్తున్నారట. పరిధికి మించి ప్రవర్తించామా అని ఒక్కోసారి ఉలిక్కి పడుతున్నారట. భవిష్యత్‌లో విచారణకు పిలవరు కాదా అని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అసలే అక్షింతలు పడ్డాయి. ఇప్పుడు పిలిస్తే ఇంకా డ్యామేజ్ అవుతుందని టెన్షన్ పడుతున్నారట ఎమ్మెల్యే. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని.. దారినపోయే కంపను తగిలించుకున్నామని ఆవేదన చెందుతున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి జిల్లా వైసీపీ వర్గాల్లో ఏమ్మా చంటి..! ఏంటి సంగతి అని సెటర్లూ వేస్తున్నారట.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..