Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కార్తీక మాస శోభతో అశేష భక్తజన సందోహం మధ్య జరుగుతున్న ‘కోటి దీపోత్సవం – 2026’ ఆధ్యాత్మిక మహోత్సవం మూడో రోజు అత్యంత వైభవంగా ముగిసింది. పవిత్రమైన కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగంగా వేదికపై శివపరివారానికి కోటి పుష్పార్చన అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా దంపతులు ప్రత్యేకంగా పాల్గొని గోసేవ నిర్వహించడంతో పాటు, కోటి లింగేశ్వరుడికి పవిత్ర జలంతో అభిషేకం చేశారు.
ఈ మహోత్సవంలో ప్రధాన ఘట్టంగా భావించే కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దివ్య కల్యాణోత్సవం అత్యంత నేత్రపర్వంగా జరిగింది. ఈ కల్యాణ వేడుకలో మాంగల్య గౌరీ పూజ, జీలకర్ర బెల్లం సమర్పణ తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణంలో మాంగళ్య ధారణ ఘట్టం కనులపండువగా సాగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో శ్రీమతి జస్టిస్ పెరుగు శ్రీసుధ దంపతులు కూడా పాల్గొని ప్రాంగణంలోని మహాశివలింగానికి అభిషేకం చేశారు.
Also Read
- Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
- Sun Transit : రేపు సూర్యుడి రాశి మార్పుతో అదృష్టం.. ఈ 8 రాశులకు శుభ ఘడియలు!
- Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
- Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దివ్య కల్యాణంలో మాంగళ్య ధారణ!
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/aYXiIdOqUW
— BhakthiTV (@BhakthiTVorg) November 16, 2026
కోటి దీపోత్సవ ప్రాంగణంలోని మహాశివలింగానికి అభిషేకించిన శ్రీమతి జస్టిస్ పెరుగు శ్రీసుధ దంపతులు
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/XB1jeHleSd
— BhakthiTV (@BhakthiTVorg) November 16, 2026
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అందించిన ప్రవచనామృతం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. దీపం వెలిగిస్తే ఇల్లు వెలిగినట్లే మన జీవితాల్లోనూ వెలుగులు నిండుతాయని, కార్తీకమాసంలో దీపం వెలిగించేది పరబ్రహ్మ అనుగ్రహం కోసమేనని ఆయన వివరించారు. శివకేశవులు వేరు కాదని, భగవంతుడిని భేదాలతో చూడకూడదని తెలిపారు. కలియుగంలో మనిషి ప్రవర్తన, రామాయణ విశేషాలు, పోతన భాగవతం, తిక్కన వర్ణించిన భగవంతుని అపురూప రూపాల గురించి ఆయన సుందరంగా వివరిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేశారు.
అలాగే, శ్రీ వ్రతాధర రామానుజ జీయర్ మఠం వేదపాఠశాల విద్యార్థుల మంగళకరమైన వేదపఠనం, పర్ణిక బృందం అందించిన భక్తి సంగీత గానామృతం ప్రాంగణాన్ని మార్మోగించాయి. ప్రదోషకాల మహాభిషేకం, కర్ణాటకకు చెందిన శ్రీ శివ యోగీశ్వర సాధు సంస్థానం మఠానికి చెందిన డాక్టర్ శ్రీ శివానంద భారతి మహా స్వామీజీ అనుగ్రహ భాషణం ఈ వేడుకలకు మరింత శోభను తెచ్చాయి. కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ఒక్క పుష్పం సమర్పించినా అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసించగా, ఈ మూడో రోజు కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభతో దిగ్విజయంగా ముగిశాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!