రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే మా లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులున్నాయని తెలిపారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. "పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటాం.
జాతీయ మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద విడుదల చేయడం సంతోషమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ను ఓడించిన ఉత్సాహంతోనే బీజేపీని ఓడించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రేవంత్ తెలిపారు.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరు గ్యారంటీలకు అప్లయ్ చేసిన ప్రతి అర్హుడికి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు.
తొమ్మిదేండ్ల అహంకార పాలనకు చరమ గీతం పాడింది కాంగ్రెస్ కార్యకర్తలేనని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. తుక్కుగూడ 'జనజాతర' సభలో ఆమె ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్న ఆమె.. ఆరు హామీలపై కీలక ప్రకటన చేశారు.
నేడు సాయంత్రం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జన జాతర పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు.
దేశ ముఖచిత్రాన్ని మార్చివేసే కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జంగ్ సైరన్ ఊదాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్... నరేంద్ర మోడీ నేతృత్వంలోని పదేళ్ల ఎన్డీఏ నిరంకుశ, దుష్పరిపాలనకు చరమగీతం పాడాలనే కృతనిశ్చయంతో ఉంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తుక్కుగూడలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో తెలంగాణ చేరుకోవాల్సిన స్థాయికి చేరుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి డ్రామా చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయ జీవితం ప్రారంభం అయిందే కాంగ్రెస్ నుండే అని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు…
తెలంగాణ బీజేపీలో ఉన్న అంతర్గత ఆధిపత్య పోరుకు పార్టీ అగ్రనేత అమిత్ షా చెక్ పెట్టినట్టేనని తాజా టాక్. పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌కే హైకమాండ్ అండ అని తుక్కుగూడ సభలో షా క్లారిటీ ఇవ్వడంతో.. కాషాయ శిబిరంలో అలజడి మొదలైందట. బహిరంగ సభ నుంచే పార్టీ నేతలకు.. శ్రేణులకు షా స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఆ అంశాలపైనే వాడీవేడీ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు బీజేపీ సీనియర్లకు బీపీ ఎక్కువైందట. బండి…
కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అమిత్ షా. ఇవాళ సాయంత్రం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారు. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరిస్తారని… టీఆర్ఎస్‌పై యుద్ధం ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తుక్కుగూడ సభకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అప్పటికే ఏర్పాట్లన్నీ…