OTR: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. షెడ్యూల్ కూడా విడుదలైంది. కానీ… టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో మాత్రం సీట్ షేరింగ్‌పై క్లారిటీ రావడంలేదు. చర్చోపచర్చలు జరుగుతున్నా పీటముడి మాత్రం అలాగే కొనసాగుతోంది. స్థానిక సమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. రెండున్నరేళ్ల కూటమి పాలనకు లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు అద్దంపట్టబోతున్నాయి. ఏకపక్షంగా విజయం సాధించాలని కూటమి నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే, సీట్ల సర్దుబాటు, షేరింగ్ వ్యవహారం మాత్రం కుదరడంలేదు. మూడు పార్టీల మధ్య సీట్ల లెక్క కొలిక్కి రావడంలేదు. తమకు కావాల్సిన సీట్ల విషయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టు వదలడంలేదు. అటు సీఎం చంద్రబాబు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటూ పవన్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. కొన్ని విజయవాడ లాంటి కీలక మేయర్, చైర్పర్సన్ స్థానాలపై జనసేన కన్నేసింది. వాటి విషయంలో మెట్టు దిగనంటోంది. అందుకే సీట్ షేరింగ్ లెక్క తేలడంలేదనే మాటలు వినిపిస్తున్నాయి. విజయవాడ మేయర్ పదవినే తీసుకుంటే… దానిని జనసేనకు కేటాయిస్తే టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి వచ్చే ప్రమాదం ఉంది. టీడీపీ నుంచి ఓట్లు బదిలీ కావడంపైనా సందేహాలు నెలకొంటాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేరు. స్థానిక సంస్థల ఎన్నికలు వేరు. లోకల్ బాడీ ఎన్నికల పట్ల కేడర్, ఓటర్లు చాలా సీరియస్‌గా ఉంటారు. పంతాలు, పట్టింపులు పెద్దగానే ఉంటాయి. చాలా సీరియస్‌గా తీసుకుని పని చేస్తుంటారు. లోకల్ బాడీస్‌లో పొత్తుల కాన్సెప్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ పొత్తు ధర్మం ప్రకారం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి.
సీట్ల షేరింగ్‌పై చర్చించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కనీసం నాలుగు సార్లు సమావేశాలు జరిగాయి. సీట్ల విషయంలోనే ఇంత గందరగోళం ఉంటే.. కలిసి పోటీ చేసినా పోలింగ్ సమయంలో ఓట్ల బదిలీ సజావుగా జరగటం సులభమేనా..? అనే చర్చ కూటమి సర్కిల్స్‌లో జరుగుతోందట. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? సీట్ షేరింగ్ లెక్కలే కొలిక్కి రాకపోతే… ఎన్నికల్లో ఓట్ల బదిలీ సాధ్యమవుతుందా..? మూడు పార్టీల కేడర్ పంతాలకు పోకుండా కలసి పనిచేస్తారా..? కార్యకర్తల మధ్య సమన్వయం, సయోధ్య సాధ్యమవుతుందా..? ఇప్పటికే మూడు పార్టీల కేడర్ మధ్య సఖ్యత లేదు. అధిష్టానం స్థాయిలో నాయకులు ఐక్యంగా ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అలాంటి పరిస్థితిలేదు. దీంతో… స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటు విషయంలోనే ఈ పరిస్థితి ఉంటే… ఇక లోకల్ కేడర్ స్పందన ఎలా ఉంటుంది..? ఆశించిన స్థానాలు దక్కకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు ఖాయమేనా..? వ్యవహారం తేడా కొడుతుందా..? ఫలితాలు ఎలా ఉంటాయి..? ఇలాంటి అనేక అనుమానాలు, సందేహాలు కూటమి నాయకులను వేధిస్తున్నాయట. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సీట్ షేరింగ్ తేలేదెప్పుడు..? అభ్యర్థులను ప్రకటించేదెప్పుడు..? ప్రచారం సాగించేదెప్పుడు..? అనే చర్చ కూటమిలో జోరుగా జరుగుతోందని సమాచారం.

