OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో సీట్ షేరింగ్‌పై నో క్లారిటీ
- ఏకపక్షంగా విజయం సాధించాలంటున్న కూటమి నేతలు
- సీట్ల విషయంలో పట్టువదలని విక్రమార్కుడిలా పవన్ కళ్యాణ్
- ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటూ మొదట్నుంచే పవన్ మైండ్‌గేమ్
- విజయవాడ లాంటి కీలక మేయర్, చైర్పర్సన్ స్థానాలపై జనసేన కన్ను
- నాలుగు సార్లు సమావేశమైన మూడు పార్టీలు
- ఇంత గందరగోళంతో ఓట్ల బదిలీ సజావుగా జరుగుతుందా..?
- మూడు పార్టీల కేడర్ పంతాలకు పోకుండా కలసి పనిచేస్తారా..?
- ఆశించిన స్థానాలు దక్కకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు ఖాయమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. షెడ్యూల్ కూడా విడుదలైంది. కానీ… టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో మాత్రం సీట్ షేరింగ్‌పై క్లారిటీ రావడంలేదు. చర్చోపచర్చలు జరుగుతున్నా పీటముడి మాత్రం అలాగే కొనసాగుతోంది. స్థానిక సమరాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. రెండున్నరేళ్ల కూటమి పాలనకు లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు అద్దంపట్టబోతున్నాయి. ఏకపక్షంగా విజయం సాధించాలని కూటమి నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. అయితే, సీట్ల సర్దుబాటు, షేరింగ్ వ్యవహారం మాత్రం కుదరడంలేదు. మూడు పార్టీల మధ్య సీట్ల లెక్క కొలిక్కి రావడంలేదు. తమకు కావాల్సిన సీట్ల విషయంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టు వదలడంలేదు. అటు సీఎం చంద్రబాబు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫ్రెండ్లీ కంటెస్ట్ అంటూ పవన్ మైండ్ గేమ్ మొదలు పెట్టారు. కొన్ని విజయవాడ లాంటి కీలక మేయర్, చైర్పర్సన్ స్థానాలపై జనసేన కన్నేసింది. వాటి విషయంలో మెట్టు దిగనంటోంది. అందుకే సీట్ షేరింగ్ లెక్క తేలడంలేదనే మాటలు వినిపిస్తున్నాయి. విజయవాడ మేయర్ పదవినే తీసుకుంటే… దానిని జనసేనకు కేటాయిస్తే టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి వచ్చే ప్రమాదం ఉంది. టీడీపీ నుంచి ఓట్లు బదిలీ కావడంపైనా సందేహాలు నెలకొంటాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేరు. స్థానిక సంస్థల ఎన్నికలు వేరు. లోకల్ బాడీ ఎన్నికల పట్ల కేడర్, ఓటర్లు చాలా సీరియస్‌గా ఉంటారు. పంతాలు, పట్టింపులు పెద్దగానే ఉంటాయి. చాలా సీరియస్‌గా తీసుకుని పని చేస్తుంటారు. లోకల్ బాడీస్‌లో పొత్తుల కాన్సెప్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ పొత్తు ధర్మం ప్రకారం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి.
సీట్ల షేరింగ్‌పై చర్చించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కనీసం నాలుగు సార్లు సమావేశాలు జరిగాయి. సీట్ల విషయంలోనే ఇంత గందరగోళం ఉంటే.. కలిసి పోటీ చేసినా పోలింగ్ సమయంలో ఓట్ల బదిలీ సజావుగా జరగటం సులభమేనా..? అనే చర్చ కూటమి సర్కిల్స్‌లో జరుగుతోందట. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది..? సీట్ షేరింగ్ లెక్కలే కొలిక్కి రాకపోతే… ఎన్నికల్లో ఓట్ల బదిలీ సాధ్యమవుతుందా..? మూడు పార్టీల కేడర్ పంతాలకు పోకుండా కలసి పనిచేస్తారా..? కార్యకర్తల మధ్య సమన్వయం, సయోధ్య సాధ్యమవుతుందా..? ఇప్పటికే మూడు పార్టీల కేడర్ మధ్య సఖ్యత లేదు. అధిష్టానం స్థాయిలో నాయకులు ఐక్యంగా ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అలాంటి పరిస్థితిలేదు. దీంతో… స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల సర్దుబాటు విషయంలోనే ఈ పరిస్థితి ఉంటే… ఇక లోకల్ కేడర్ స్పందన ఎలా ఉంటుంది..? ఆశించిన స్థానాలు దక్కకపోతే ఎన్నికల్లో ఇబ్బందులు ఖాయమేనా..? వ్యవహారం తేడా కొడుతుందా..? ఫలితాలు ఎలా ఉంటాయి..? ఇలాంటి అనేక అనుమానాలు, సందేహాలు కూటమి నాయకులను వేధిస్తున్నాయట. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సీట్ షేరింగ్ తేలేదెప్పుడు..? అభ్యర్థులను ప్రకటించేదెప్పుడు..? ప్రచారం సాగించేదెప్పుడు..? అనే చర్చ కూటమిలో జోరుగా జరుగుతోందని సమాచారం.
Also Read
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
తాజావార్తలు
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..