Odela 2: నాన్ థియేట్రికల్’కి కళ్ళు చెదిరే డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే సంచలన చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఓదెల 2’ సినిమా గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉందని, ప్రేక్షకులకు సరికొత్త తమన్నా భాటియాను చూసే అవకాశం దక్కబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సూపర్‌నాచురల్ థ్రిల్లర్‌లో తమన్నా ప్రధాన పాత్రలో ఒక శివ సత్తుగా కనిపించనుంది. సినిమా బడ్జెట్ సుమారు 23 కోట్ల రూపాయలు కాగా, నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా 20 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. అంటే, ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే దాదాపు తన బడ్జెట్‌ను రికవరీ చేసుకున్నట్లు భావించవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే, సినిమాకు ఉన్న క్రేజ్‌ను, కంటెంట్ ఎలా ఉందనే దానిపై క్లారిటీ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను సుమారు 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం, అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ మరియు శాటిలైట్ హక్కులు కూడా మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.
PrabhasHanu: అగ్రహారం’లో ప్రభాస్ కొత్త అవతారం!
Also Read
ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది కాదు, అతను దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ అశోక్ తేజ అనే యువ దర్శకుడితో సినిమాను రూపొందించారు. సంపత్ నంది రచయితగా, నిర్మాతగా కీలక పాత్ర పోషిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. తమన్నా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుండగా, ఆమె నాగ సాధ్వి శివశక్తి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని అంటున్నారు. ఈ రేంజ్‌లో నాన్-థియేట్రికల్ డీల్ సాధించడం అంటే, సినిమా కంటెంట్‌పై బయ్యర్లకు గట్టి నమ్మకం ఏర్పడేలా ఉంది. ఏప్రిల్ 17, 2025న విడుదలకు సిద్ధమవుతున్న ‘ఓదెల 2’ థియేటర్లలో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి. ఈ సినిమా ద్వారా తమన్నా మరోసారి తన నటనా సత్తాను చాటుకోనుందని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!