Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bunny Vasu: ఇప్పుడు టాలీవుడ్లో సినిమా తీయడం కంటే, దాన్ని అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకురావడమే నిర్మాతలకు పెద్ద సవాల్‌గా మారింది. తాజాగా ‘ఇడుపు కాయితం’ సినిమా ప్రెస్ మీట్లో నిర్మాత బన్నీ వాసు చేసిన కామెంట్స్ ఇదే విషయాన్ని మరోసారి బయటపెట్టాయి. బాక్సాఫీస్ దగ్గర తన ‘తండేల్’ హీరో సినిమాతోనే పోటీ పడాల్సి రావడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన చాలా ఆవేదనతో, ఓపెన్‌గా సమాధానమిచ్చారు. రిలీజ్ డేట్ల విషయంలో నిర్మాతల నిస్సహాయతను ఆయన బయటపెట్టిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
‘ఇడుపు కాయితం’ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి బజ్ ఉందని, అయితే మీ ‘తండేల్’ హీరో సినిమాతోనే పోటీ పడాల్సి వస్తోంది కదా.. మీ వాళ్లే కాబట్టి డేట్ మార్చుకోవచ్చు కదా అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి బన్నీ వాసు స్పందిస్తూ.. “ఆయనతో నా నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నాను. కానీ కొన్ని పరిస్థితులు మా చేతుల్లో ఉండటం లేదు. నిర్మాతలుగా మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ రోజుల్లో రిలీజ్ డేట్లు మా చేతుల్లో ఉండటం లేదు.. అంతకన్నా ఎక్కువ నేను ఏమీ చెప్పలేను” అంటూ తన ఆవేదనను బయటపెట్టారు. ఓటీటీ సంస్థల ఒత్తిడి వల్లే ఇలా జరుగుతోందా అని అడగ్గా.. దానిపై తాను ఏమీ కామెంట్ చేయనని, కానీ రిలీజ్ డేట్ అనేది కేవలం నిర్మాత ఒక్కడి నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
ఇక ఇడుపు కాయితం సినిమా షూటింగ్ విశేషాల గురించి డైరెక్టర్ వంశీ, బన్నీ వాసు మాట్లాడుతూ.. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో 40 రోజులు, హైదరాబాద్‌లో 30 రోజులు కలిపి మొత్తం 70 రోజుల పాటు షూటింగ్ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటల్లో హీరోహీరోయిన్ల మధ్య క్యూట్ లవ్ స్టోరీ, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపిస్తున్నాయని.. అయితే అంత బాగున్న వాళ్లు ఎందుకు విడిపోతారనే సస్పెన్స్ సినిమాలో కీలకమని చెప్పారు. ఆ కారణం ఏంటనేది స్టేజ్ మీద చెబితే బాగోదని, థియేటర్లలో చూస్తేనే ఆ కిక్ ఉంటుందని దర్శకుడు వంశీ ఆసక్తిని పెంచారు. ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
-
Visakhapatnam: కైలాసగిరి వద్ద స్కూల్ బస్సు ప్రమాదం.. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆరా!
-
Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
-
AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
-
Kadapa: ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి తండ్రి గన్ తో హల్చల్
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!