Crazy Crossover: సూర్య కోసం మమిత ‘ప్రేమలు’కు బ్రేకప్.. ప్రతీకారం తీర్చుకోవడానికే ‘సీన్’లోకి నస్లెన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమలు’ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న జంట నస్లెన్, మమిత బైజు . ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అందరూ ‘ప్రేమలు 2’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, స్క్రిప్ట్ విషయంలో ప్రేక్షకులను ఆకట్టుకునే పరిస్థితి లేదని దర్శకుడు భావించడంతో ‘ప్రేమలు 2’ ఆగిపోయింది. ఇదంతా అసలు విషయం కాగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ సినిమాకు, సూర్య సినిమాలకు ముడిపెడుతూ అల్లిన ఒక ఫన్నీ & క్రేజీ ఫ్యాన్ థియరీ తెగ వైరల్ అవుతోంది!
అసలేంటి ఆ వైరల్ థియరీ?
ఒక నెటిజన్ చేసిన కామెంట్ ప్రకారం.. ‘ప్రేమలు’, సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (VAS), అలాగే ఇటీవల విడుదలైన ‘సీన్’ (Scene) సినిమాలన్నీ ఒకే సినిమాటిక్ యూనివర్స్‌లా కనిపిస్తున్నాయి! ఆ థియరీ ఏంటంటే.ప్రేమలు సినిమా క్లైమాక్స్‌లో మమిత బైజు ప్రియుడు నస్లెన్ తన కెరీర్ కోసం విదేశాలకు వెళ్లిపోగా తాను కూడా వస్తానని అంటుంది. అలా విదేశాలకు వెళ్లిన మమిత, అక్కడ సూర్య (సంజయ్ విశ్వనాథ్) కొడుకుకు సరోగేట్ మదర్‌గా మారుతుంది. ఆ క్రమంలో ఆమె సూర్యతో ప్రేమలో పడిపోతుంది. (వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూర్య, మమిత జంటగా నటించిన సంగతి తెలిసిందే). తన ప్రేయసి మమిత తనను వదిలేసి సూర్యతో వెళ్లిపోయిందనే బాధతోనే నస్లెన్ తన ప్రేమను దూరం చేసిన సూర్యపై ప్రతీకారం తీర్చుకోవడానికే జిత్తు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన ‘సీన్’ (Scene) సినిమాలో నస్లెన్ ఏకంగా విలన్‌గా మారి సూర్యతో తలపడ్డాడట!
Also Read
- Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
- Kaaka Movie: 'కాకా' నైజాం రైట్స్ ఆ సంస్థకే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
- Ramayana Part 1: రావణుడిని హైలైట్ చేయడం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదే.. నమిత్ క్లారిటీ!
- Vrushakarma: ‘కింగ్ 100’లో నాగచైతన్య గెస్ట్ రోల్? ఒక్క మాటతో హింట్ ఇచ్చేసిన చైతూ!
కేవలం సరదా కోసం ఒక నెటిజన్ పెట్టిన ఈ కామెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)లలో రీల్స్, మీమ్స్ రూపంలో దూసుకుపోతోంది. నిజ జీవితంలో నస్లెన్ ‘ప్రేమలు 2’ చేయకపోవడానికి, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్య-మమిత కలిసి నటించడానికి, ‘సీన్’ సినిమాలో సూర్యకు ప్రత్యర్థిగా నస్లెన్ పవర్ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడానికి భలే సింక్ కుదిరిందంటూ సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా, మూడు వేర్వేరు సినిమాలను కలిపి నెటిజన్లు క్రియేట్ చేసిన ఈ ‘సూర్య-నస్లెన్-మమిత’ రివెంజ్ డ్రామా ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి వినోదాన్ని పంచుతోంది!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Crazy Crossover: సూర్య కోసం మమిత ‘ప్రేమలు’కు బ్రేకప్.. ప్రతీకారం తీర్చుకోవడానికే ‘సీన్’లోకి నస్లెన్!
-
Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
-
Visakhapatnam: కైలాసగిరి వద్ద స్కూల్ బస్సు ప్రమాదం.. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆరా!
-
Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
-
AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!