Instagram : మీ పిల్లలు టీనేజ్ వయసుకు వచ్చారా.. అయితే ఇన్ స్టా గ్రామ్ కు దూరంగా ఉంచండి. లేదంటే మీ పిల్లల్ని ఇన్ స్టా చెడగొట్టేస్తుంది. ఇండియాలో ఏ మూలకు వెళ్లినా ఇప్పుడు ఇన్ స్టా వల్ల చెడిపోతున్న టీనేజ్ పిల్లలే ఎక్కువ. టీనేజ్ వయసులోని అమ్మాయిలు, అమ్మాయిలు ఇన్ స్టాలోనే ఎక్కువ గడిపేస్తున్నారని ఎన్నో సర్వేలు బయటపెడుతున్నాయి. ఇన్ స్టాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువైపోయింది. చూసే కళ్లు వాళ్ల పసి మనసుల్ని మార్చేస్తున్నాయి. అడల్ట్ వైపు అడుగులేసేలా చేస్తున్నాయి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఇదే తంతు. అప్పటి వరకు పద్ధతిగా ఉన్న డ్రెస్ కల్చర్ మారిపోతుంది.
read also : Liquor : ఏ బ్రాండ్ డేంజర్.. ఏది తాగితే బెటర్..?
జుట్టు స్టైల్ మారుతుంది. స్టైల్ స్టైల్ బట్టలేసుకుని ఫోజులు కొట్టాలనే ఆలోచనలు పెరుగుతున్నాయి. ఒకరిని చూసి ఒకరు మెల్లిమెల్లిగా డీసెంట్ కల్చర్ ను వదిలేసి చప్రి కల్చర్ లోకి వచ్చేస్తున్నారు. అమ్మాయిలను పడేయాలనే థాట్స్ అబ్బాయిలకు పెరుగుతున్నాయి. అబ్బాయిలతో చాటింగ్ లు చేయాలనే ఆలోచనలు అమ్మాయిలకు పెరుగుతున్నాయి. ఇవన్నీ ఇన్ స్టా నేర్పిస్తోంది. టీనేజ్ కు రాగానే ఇన్ స్టాలో ఐడీలు క్రియేట్ చేసుకుని అందులో వచ్చే చెత్త కంటెంట్ చూస్తున్నారు. ఆ కంటెంట్ లో ఎక్కువగా అడల్ట్, లవ్ అనే రీల్సే ఎక్కువగా వస్తున్నాయి.
పైగా ఈ నడుమ టీనేజ్ జంటలు కొన్ని ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ ఎలా చెడిపోవాలో దగ్గరుండి చూపిస్తున్నాయి. ఆ టీనేజ్ లవ్ జంటలను చూసి తమకు కూడా ఒక లవర్ ఉంటే బాగుండే అని ఆలోచన అటు అబ్బాయిలకు, ఇటు అమ్మాయిలకు ఎక్కువ అవుతోంది. ఇంకేముంది స్కూల్ లో, కాలేజీలో ఏదో ఒక అమ్మాయిని పడేయాలని టీనేజ్ పోరగాళ్లు నానా తంటాలు పడటం మొదలైపోతోంది. ఒకప్పుడు అంటే ఫోన్లు లేవు. పైగా ఒకవేళ ఉన్నా సరే నెంబర్లు తెలుసుకోవడం చాలా కష్టం.
కానీ ఇప్పుడు అందరికీ ఇన్ స్టా అకౌంట్లు ఉంటున్నాయి కదా. ఇంకేముంది ఐడీలు సెర్చ్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెట్టేయడం.. అటు నుంచి అమ్మాయి కూడా వీడేదో నేనంటే పడి చస్తున్నాడే అని మురిసిపోయి ఓకే చేసేయడం.. ఇంకేముంది నిబ్బా-నిబ్బి లవ్ స్టోరీ స్టార్ట్. పోరడు కాస్త స్టైల్ గా బైక్ నడిపినా సరే టీనేజ్ అమ్మాయిలు వావ్ అనుకుని మురిసిపోవడం. హాయ్.. బుజ్జి, బంగారం అనగానే వీడికంటే నన్ను ఇంకెవడూ బాగా చూసుకోడు అని టీనేజ్ అమ్మాయిలు ఊహించేసుకోవడం.
వాడి కోసం ఏం చేయడానికైనా అమ్మాయిలు రెడీ అయిపోవడం. ఇంకేముంది అటు ఆ నిబ్బాగాడు ఇటు ఈ నిబ్బి సదువులు పక్కుకు పెట్టి ఇన్ స్టాలో చాటింగ్ లు.. బేకరీల్లో మీటింగులు. ఈ నడుమ థియేటర్లకు వెళ్లి మూవీలు కూడా చూసేస్తున్నాయి మన నిబ్బా-నిబ్బి జంటలు. హైస్కూల్ నుంచే చెడిపోవడం మొదలైపోతోంది. ఇదంతా వాళ్ల వయసు ప్రభావమే. బాధ్యతలు తెలియని, చెబితే వినని వయసు. త్వరగా చెడిపోయే ఏజ్ అది. అందుకే మీ పిల్లలను ఈ రోజుల్లో ఇన్ స్టాకు ఎంత దూరంగా ఉంచితే అంత బెటర్ అంటున్నారు ఆల్రెడీ చెడిపోయిన పిల్లల పేరెంట్స్.
read also : Viral News : గేదెకు రూ.14 లక్షలు.. అరేయ్ ఏంట్రా ఇది..