Liquor : మద్యం ఏ బ్రాండ్ తాగితే ఎక్కువ ప్రమాదం.. ఏ బ్రాండ్ తాగితే బెటర్ అనేది చాలా మందికి ఒక అనుమానమే. మన దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. విస్కీ, రమ్, బీర్, వైన్, వోడ్కా బ్రాండ్ లు ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇందులో ఏ బ్రాండ్ లో ఎంత ఆల్కాహాల్ ఉంటుంది.. ఏది తాగితే బెటర్ అనేది ఓ లుక్కేద్దాం. ముందుగా ఓడ్కా గురించి తెలుసుకుందాం. ఇది అన్నింటికంటే ఎక్కువ కిక్ ఇచ్చే బ్రాండ్.
read also : Viral News : గేదెకు రూ.14 లక్షలు.. అరేయ్ ఏంట్రా ఇది..
వోడ్కాలో అన్ని బ్రాండ్స్ తో పోలిస్తే 60 శాతం ఆల్కాహాల్ ఉంటుంది. ఇది తాగిన వెంటనే కిక్ ఇచ్చేస్తుంది. కాబట్టి ఇది తాగితే ఎక్కువ డేంజర్ అని డాక్టర్లే చెబుతున్నారు. విస్కీలో 40 నుంచి 50 శాతం ఆల్కహాల్ ఉంటుంది. లివర్ సమస్యలు త్వరగా రావడానికి కారణం అవుతుంది. విస్కీలో చాలా చీప్ లిక్కర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అందులో కొంచెం క్వాలిటీగా ఉండే బ్రాండ్స్ కాకుండా వేరే బ్రాండ్స్ తాగితే చాలా డేంజర్ అంటున్నారు.
ఇక రమ్‌లో కూడా 40 శాతం ఆల్కాహాల్ ఉంటుంది. రమ్ లో చాలా బ్రాండ్లు ఉన్నాయి. అందులో దాదాపు అన్నింటిలో ఈ స్థాయిలోనే ఆల్కాహాల్ ఉంటుంది. కాబట్టి రమ్ తాగినా త్వరగానే కిక్ ఎక్కుతుంది. ఈ రమ్ తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. వైన్ లో 25 శాతం ఆల్కాహాల్ ఉంటుంది. ఇది కూడా డేంజరే. చివరగా బీర్‌లో నాలుగు నుంచి ఆరు శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మద్యానికి దూరంగానే ఉంది. ఎంత ఆల్కాహాల్ తీసుకున్నా ప్రమాదమే. కానీ మిగతా అన్ని బ్రాండ్లతో పోలిస్తే బీర్ కాస్త పర్లేదు.
read also : Railway Charges : రైల్వే ప్రయాణికులకు షాక్.. ఛార్జీల పెంపు..