Jr NTR : నిర్మాత సూసైడ్ అటెంప్ట్.. పనిలేనోడు చేసిన ట్వీట్.. ట్విట్టర్ అంతా ఒకటే రచ్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో పనిలేని వారందరూ సోషల్ మీడియాలోనే ఉండటం వల్ల అక్కడ అనేక చర్చలు జరుగుతున్నాయి. పనికొచ్చే చర్చలు కొన్నైతే పనికిరాక టైం పాస్ చేసేందుకు చేసే చర్చలు కొన్ని ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ట్విట్టర్లో అయితే ఒక విషయం హాట్ టాపిక్ అవుతుంది. అదే ఎన్టీఆర్ హీరోగా నటించిన ఒక సినిమా నిర్మాత ఆత్మహత్యాయత్నం. అసలు విషయం ఏమిటంటే ఆ మధ్యకాలంలో శ్రేయ హాట్ స్టార్ లో నటించిన ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ తాను ఎన్టీఆర్ హీరోగా జెనీలియాతో కలిసి చేసిన ఒక సినిమా నిర్మాత సినిమా ఆఖరి రోజు అందరి పేమెంట్స్ ఇచ్చేసి హైదరాబాదులో ఉన్న ఒక లేక్ లో దూకాడు అని చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత అతనికి ఏమీ జరగలేదు అతనితోపాటు ఉన్నవాళ్లు ఫోటోలు తీసుకుని మాకు చూపించారని చెప్పుకొచ్చింది. నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో షో టైం అనే ఒక వెబ్ సిరీస్ మార్చి నెలలో రిలీజ్ అయింది.
Elephant Tension : కొమరం భీం జిల్లాకు తప్పిన ఏనుగు ముప్పు
Also Read
ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఈ మేరకు ఇంటర్వ్యూ చేసిన దాన్ని ఇప్పుడు తీసుకువచ్చిన ఒక నెటిజన్ ఎన్టీఆర్ను తక్కువ చేసి చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. యాదృచ్ఛికంగా అతను ప్రభాస్ ఫ్యాన్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు మా హీరో సినిమానే తక్కువ చేసి మాట్లాడతావా అంటూ ప్రభాస్ గురించి ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయిన వృద్ధురాలు చేసిన చైన్ స్మోకర్ కామెంట్స్ ని తెరమీదకి తీసుకొచ్చారు. దానికి తోడు ఆర్ఆర్ఆర్ తర్వాత నుంచి ఎన్టీఆర్ ని టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది మెగా ఫ్యాన్స్ ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి అండగా నిలుస్తూ నరసింహుడు ప్రొడ్యూసర్ హుస్సేన్ సాగర్ లో దూకి చనిపోయే ప్రయత్నం చేశాడు అనే విషయాన్ని మరింత హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు సూసైడ్ చేసుకోబోయేడు అంటూ వచ్చిన వార్తలను ప్రస్తావిస్తున్నారు.
దానికి తోడు అజ్ఞాతవాసి డిస్ట్రిబ్యూటర్లు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశారు అంటూ నట్టి కుమార్ చేసిన కామెంట్లను తెరమీదకు తీసుకొచ్చి తిప్పుతున్నారు. ఎవరో పని లేని ఒక వ్యక్తి మార్చి నెలలో జరిగిన ఇంటర్వ్యూ బిట్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడంతో అది ఇప్పుడు ఇంత రచ్చకు కారణం అవుతుంది. నిజానికి ప్రతి హీరో లైఫ్ లో హిట్లు ఉన్నాయి, ఫ్లాపులు ఉన్నాయి, డిజాస్టర్లు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తీసుకువచ్చి మా హీరో గొప్ప మీ హీరో గొప్ప కాదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయడం అంత మూర్ఖత్వం మరోటి లేదు. ఎందుకంటే ఫైనల్లీ నటీనటులు అందరూ క్లోజ్ గానే ఉంటారు. వాళ్ళు కలిస్తే ఎంతో ఆనందంగా గడుపుతారు. కానీ వారి అభిమానులుగా వీళ్ళు సోషల్ మీడియాలో రచ్చ చేయడం తప్ప ఏది ఉపయోగం ఉండదు. అది శృతిమించితే వ్యక్తిగతాల జోలికి వెళ్లి తమ హీరో పేరు చెడగొడుతూ పరువు తీస్తున్నారు.
- Tags
- Jr NTR
- prabhas
- Ram Charan
- Shreya
తాజావార్తలు
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!