నేడు శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇవాళ ( బుధవారం ) శ్రీరామ నవమి శోభయాత్రకు అనుమతి లేదన్న లేఖను పోలీసులకు రాజాసింగ్ అందజేశారు. ఎవరు అనుమతి ఇచ్చిన ఇవ్వకున్నా శ్రీరామ నవమి శోభయాత్ర చేసి తీరుతానంటున్నారు.
ఏప్రిల్ మాసం చివరి కల్లా శ్రీనివాస సేతు ప్రారంభిస్తాం అన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఆన్ లైన్ సేవలను ఇక పై నిరంతరాయంగా కొనసాగిస్తాం అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాణహిత పుష్కరాలు కూడా తోడవడంతో గత 10 రోజులుగా రాజన్న ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. గత 23 రోజులుగా హుండీ కౌంటింగ్ జరగకపోవడంతో ఆలయంలోని హుండీలన్నీ నిండిపోయాయి. ఈనెల 10న శ్రీరామనవమి ఉత్సవాలు ముగిసిన వెంటనే, ఇన్చార్జి ఈవో రమాదేవి వెళ్ళిపోవడంతో హుండీలను లెక్కించలేదు. ప్రధానాలయం తో పాటు బద్ది పోచమ్మ దేవాలయంలో కూడా హుండీలు నిండిపోయాయి. ఆలయంలో…
తన సెల్ ఫోన్ స్నేహితుడు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఒకరు చనిపోగా… బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించలేక మరో స్నేహితుడు మనోవేదనతో ఉరేసుకొన్నాడు. ఫోన్ విషయంలో తలెత్తిన వివాదం ఇరువురి మధ్య చిచ్చురేపింది. క్షణికావేశంలో తీసుకొన్న నిర్ణయాలతో రెండు కుటుంబాలకు తీరని వేదన మిగిలింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ చెందిన నీరడి మహేష్, రాచకొండ సాయిలు స్నేహితులు. ఈ నెల 12న వీరిద్దరు కలిసి నస్రుల్లాబాద్లో జరిగిన…
తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో శ్రీరామనవమి వేడుకల్లో శోభకనిపిస్తోంది. వాడవాడలా శ్రీరాముడి కల్యాణం ఘనంగ నిర్వహించారు. శ్రీరామనవమి పేరు చెప్పగానే శోభాయాత్ర గుర్తుకువస్తుంది. సీతారాం బాగ్ నుండి మొదలైంది శోభాయాత్ర. ఆరున్నర కిలో మీటర్లు కొనసాగనుంది శోభాయాత్ర. టాస్క్ ఫోర్స్ , లా అండ్ ఆర్డర్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల తరువాత హైదరాబాద్ లో నవమి శోభాయాత్ర ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతారాంబాగ్…
సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఏమీ లేదు. జాబితా సాయంత్రం తర్వాత విడుదల అవుతుందన్నారు సజ్జల. సీఎంతో మరో భేటీ ఏమీ లేదు. రాత్రి ఏడు గంటలకు రాజ్ భవన్‌కు జాబితా పంపిస్తాం అని చెప్పారు. మంత్రుల జాబితా ఫైనల్ లిస్ట్ సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో మద్యం ప్రియులకు పోలీసులు బ్యాడ్ న్యూస్ అందించారు. శ్రీరామనవమి వేడుకల కారణంగా రెండు రోజుల పాటు నగరంలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్…
శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలం ముస్తాబవుతోంది. శ్రీసీతారామచంద్రస్వామి వారి కళ్యాణం ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే రెండో అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ మేరకు ఏప్రిల్ 2 నుంచి 16 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 10న శ్రీరాముల వారి కల్యాణం, 11న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా స్వామి వారి కల్యాణానికి పరిమిత…