పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 350 కి పైగా కోట్ల రూపాయలు దోచేశారు అని ఆయన ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి భయం పరిచయం చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. నాకు రోగాలు ఉన్నాయి బెయిల్ ఇవ్వండి అని వేడుకుని చంద్రబాబు బయటకు వచ్చాడు.
సామాజిక సాధికార బస్సు యాత్ర ఒక విప్లవం అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. అణగారిన కుటుంబాలకు, కులాలకు అండగా నిలబడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు అయిన సామాజిక సాధికారత ఒక మాట గా మాత్రమే ఉంది.