Perni Nani: హింసకు సంబంధించి వీడియోలు చూసి గవర్నర్ ఆశ్చర్యపోయారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక టీడీపీ నేతలు బీహార్ తరహా హింసా రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఈ దాడుల గురించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ గుండాలు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. హింస కోసమే అధికారంలోకి వచ్చినట్టు టీడీపీ నేతల ప్రవర్తన ఉందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.
Read Also: Palnadu: పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడులో టెన్షన్
Also Read
- SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
- Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
జరుగుతున్న హింసకు సంబంధించి వీడియోలు చూసి గవర్నర్ ఆశ్చర్యపోయారన్నారు. డీజీపీని పిలిపించి విచారణ చేస్తానని గవర్నర్ చెప్పారని పేర్ని నాని పేర్కొన్నారు. ఈ దాడులను సీరియస్‌గా తీసుకుని చర్యలు తీసుకుంటానని గవర్నర్ చెప్పారన్నారు. ఈ తరహా సంస్కృతి కొనసాగితే ఎల్లకాలం టీడీపీయే అధికారంలో ఉండదు గుర్తుంచుకోవాలన్నారు. కూటమి నేతల ఒత్తిడి మేరకు పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. ఈ దాడులను నిలువరించడానికి 26 జిల్లాలో జగన్ కమిటీలు ఏర్పాటు చేశారని.. 26 జిల్లాల్లోని లీగల్ టీంలను యాక్టివేట్ చేశారని.. న్యాయ పోరాటం చేస్తామని పేర్ని నాని వెల్లడించారు. కార్యకర్తలకు, నేతలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఎక్కడైనా దాడులు జరిగితే కమిటీ వాళ్ళకి అండగా ఉంటుందన్నారు. టీడీపీ చేసే హింసను ప్రజలకు తెలియజేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కాపాడుకోడానికి మేము తిరుగుబాటు చెయ్యాల్సి వస్తుందని పేర్ని నాని హెచ్చరించారు.
తాజావార్తలు
-
SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!
-
Rainbow Children’s Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
-
West Bengal Hotel Fire: బీర్భూమ్లో ఘోర అగ్నిప్రమాదం.. హోటల్లో ఏడుగురు సజీవ దహనం
-
Buchi Babu Sana: రవి తేజ కోసమే తొలి కథ రాశా.. ‘ఇరుముడి’ ఈవెంట్లో బుచ్చిబాబు సానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?