గంటా శ్రీనివాసరావు....తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరంలేని నాయకుడు. ఆయన పొలిటికల్ సక్సెస్‌ల సంగతి ఎలా ఉన్నా... ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారని మాత్రం గట్టిగా చెప్పుకుంటుంటాయి రాజకీయ వర్గాలు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌కు తృటిలో భారీ ప్రమాదం తప్పింది.. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురంలో MSME మీటింగ్‌కు హాజరయ్యారు మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే గంటా.. అయితే, ఒక్కసారిగా ఫొటోల కోసం కార్యకర్తలు, స్థానికులు ఎగబడటంతో కృష్ణాపురంలో MSME మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన సభా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది..
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించి.. ఆ పార్టీకి షాక్ ఇచ్చారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. దాదాపు మూడేళ్ల కిందట.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంటా.. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు రాజీనామాను ఆమోదించడం హాట్ టాపిక్‌గా మారింది.