Site icon NTV Telugu

YS Sharmila: కేసీఆర్ నన్ను టార్గెట్ చేసిండు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

Ys Sharmila

Ys Sharmila

YS Sharmila: ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినతిపత్రం అందించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్ కు తరలించారు. లోటస్ పాండ్ వైఎస్ఆర్టీపీ కార్యాలయం వద్ద వైఎస్ షర్మిల దీక్ష కొనసాగిస్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. కేసీఆర్ మరోసారి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి నన్ను టార్గెట్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది పోయి ఇలా అణగదొక్కడం భావ్యమేనా? అని ప్రశ్నించారు.

Read Also: Revanth Reddy : కేసీఆర్, కేజ్రీవాల్, అసదుద్దీన్ ముగ్గురూ సుపారీ కిల్లర్స్

ఈ రోజుతో కెసీఆర్ కు తెలంగాణ కు బంధం తెగిపోయిందని వైఎస్ షర్మిల అన్నారు. దోచుకోవడానికి తెలంగాణ లో ఇక ఏం మిగలలేదు.. అందుకే ఇప్పుడు దేశాన్ని దోచుకునేందుకు వెళ్తున్నాడంటూ ఆరోపించారు. నిజంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసి ఉంటే శ్వేత పత్రం విడుదల చేయాలని కేసీఆర్ ను షర్మిల డిమాండ్ చేశారు. ఆయన బిడ్డ లిక్కర్ మాఫియా, కొడుకు లాండ్ మాఫియా లో ఉన్నారన్నారు. వారి అవినీతిని ప్రశ్నినందుకే ఇలా తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ‘మా వాళ్ళని కొట్టారు.. నన్ను గాయపరిచారు… పాదయాత్ర ని ఆపారు. పోలీస్ డిపార్ట్మెంట్ కెసిఆర్ తోత్తులుగా మారారు. నన్ను బలవంతంగా తీసుకొచ్చారు… మా కార్యకర్తలను అరెస్ట్ చేసి ఇంత వరకు వదలలేదు. పోలీసులు హింసిస్తున్నారు. కెసిఆర్ అవినీతిని మేము మాత్రమే ప్రశిస్తున్నం. ప్రజలంతా చూస్తున్నారు… చుట్టుపక్కల అంతా కర్ఫ్యూ పెట్టారు .కనీసం పచ్చి మంచి నీళ్ళు నేను ముట్టుకొను.’ వైఎస్ షర్మిల తన దీక్షను నాలుగు గంటలుగా కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని షర్మిల అన్నారు.

Exit mobile version