Hayathnagar Bike Accident Update: సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడానికి, లైక్స్ రావడం రీల్స్ చేస్తున్న యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేస్తూ ఇప్పటికే ఎందరో చనిపోగా.. తాజాగా అలంటి ఘటనే మరొకటి జరిగింది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. శనివారం బైక్‌పై స్టంట్లు చేస్తూ తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు ఈరోజు మృతి చెందాడు. బైక్ అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న యువకుడు ప్రాణాలు విడిచాడు.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ సమీపంలో జాతీయ రహదారిపై వర్షంలో కేటీఎమ్ బైక్‌పై ఇద్దరు యువకులు స్టంట్స్ చేశారు. స్టంట్స్ చేస్తూ రీల్స్ చేస్తుండగా బైక్ ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న శివ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న యువకుడికి తీవ్ర గాయలు అయ్యాయి. ఇద్దరిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం శివ మృతి చెందాడు.
Also Read: Etela Rajender: దేశంలో ఎక్కడా లేని సంప్రదాయం తెలంగాణలో ఉంది: ఈటెల రాజేందర్
ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారిపై ఒక లైన్ మరమ్మతుల కోసం రోడ్లు వేసి వదిలివేయగా.. ఆ రోడ్లపై యువకులు బైక్‌లతో ఓవర్ స్పీడ్‌తో రీల్స్ కోసం స్టంట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.