Fahadh Faasil: ఒకప్పుడు హీరోలు అంటే.. ఆ పాత్రలు మాత్రమే చేయాలి అని ఉండేది. ఎందుకంటే .. అప్పటి ప్రేక్షకులు.. తమ హీరోను అలాగే ఎత్తులో ఉంచాలని అనుకునేవారు. ఇక జనరేషన్ మారేకొద్దీ కథలు మారాయి. కథనాలు మారాయి.. పాత్రలు మారాయి.. చూసే ప్రేక్షకులు మారారు. హీరోలే విలన్స్ అవుతున్నారు. విలన్స్ హీరోలుగా మారుతున్నారు. కథ బావుండాలే కానీ, ఎవరినైనా ఆదరిస్తాం అని నిరూపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఒక సినిమాలో ఎంత స్టార్ హీరో ఉన్నా కూడా హీరోను హీరోలానే చూస్తాం.. విలన్ ను విలన్ లానే చూస్తాం. కానీ, ఒక సినిమాలో మాత్రం హీరోను వదిలేసి విలన్ ను పొగిడేస్తున్నారు అభిమానులు. ఏ రేంజ్ లో అంటే సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. విలన్ ఒక్కడే ఒక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు సినిమాలో పాత్రతో సంబంధం లేకుండా విలన్ కు హీరో ఎలివేషన్ ఇచ్చి మరీ ట్రెండ్ చేస్తున్నారు. ఏ ఇదంతా.. కాదు. అసలు ఆ హీరో ఎవరు.. ? ఆ సినిమా ఏంటి.. ? అని అంటున్నారా.. ? ఆ హీరో ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్. ఆయన నటించిన ఆ సినిమా మామన్నన్. తెలుగులో నాయకుడు.
Chandramukhi2: ఎక్కడో .. తేడా కొడుతుంది లారెన్స్ అన్నా
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించగా.. వడివేలు కీలక పాత్రలో నటించాడు. గతనెల రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో విలన్ గా స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించాడు. ఆయనకు విలన్ గా నటించడం కొత్తేమి కాదు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు ధీటుగా విలనిజాన్ని పండించాడు. ఇప్పుడు మామన్నన్ లో రత్నవేలు పాత్రలో నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఎక్కువ కులానికి చెందిన రత్నవేలు.. తన రాజకీయ భవిష్యత్తు కోసం.. తక్కువ కులంకు చెందిన మహారాజును ఎమ్మెల్యేగా గెలిపించి ఒక బొమ్మలా వాడుకుంటాడు. అయితే ఒక దశలో కొడుకు రఘువీరా చెప్పడంతో రత్నవేలును ఎదిరిస్తాడు మహారాజు. తనకన్న తక్కువ కులం వాడి చేతిలో ఓడిపోవడం కంటే చచ్చిపోవడం మేలు అనుకున్న రత్నవేలు.. వాడిని ఓడించడానికి ఏం చేశాడు.. ? అనేది కథ. ఇక రత్నవేలుగా ఫహద్ నటన అద్భుతమని చెప్పాలి. పాత్రలో ఎంత చెడుగా చూపించినా అభిమానులు మాత్రం ఫహద్ సీన్స్ కు హీరో ఎలివేషన్స్ ఇచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం రత్నవేలు వీడియోలతో నిండిపోయింది. మరి ముందు ముందు ఈ రత్నవేలు ఇంకెలాంటి రికార్డులను బద్దలుకొడతాడో చూడాలి.