హాట్ హీరోయిన్ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కెనడా కు చెందిన నోరా ఫతేహి మోడల్ గా సింగర్ ఎంతగానో అలరించింది. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ మొదటి సారి బాలీవుడ్ లో హాట్ ఐటెం భామ గా అడుగుపెట్టింది.. ఇప్పటి వరకు ఈ భామ పదిహేను కి పైగా స్పెషల్ సాంగ్స్ ను చేశారు.అలాగే నోరా ఫతేహి తెలుగు లో కూడా ఐటెం సాంగ్స్ ను చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.. ఆ తరువాత బాహుబలి, కిక్ 2 వంటి సినిమాల లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది.ప్రస్తుతం పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు సినిమాలో నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా ఎంపిక అయింది..
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాక్విలిన్ ఫెర్నాండెజ్ సంప్రదించగా ఆమె కొన్ని కారణాలతో తప్పుకోవడంతో ఆమె స్థానము లో నోరా ఫతేహి ని తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే హరి హర వీరమల్లు సినిమాలో నోరా ఫతేహి పాత్ర ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.చిత్ర యూనిట్ ఆమె లుక్ ను కూడా విడుదల చేయలేదు.ఇదిలా ఉంటే నోరా ఫతేహి క్యాస్టింగ్ కౌచ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.కొందరు తనను డేటింగ్ చేయమని ఎంతగానో బలవంతం చేశారని కీలక ఆరోపణలు చేసింది. బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని . కెరీర్ బిగినింగ్ లో తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఆమె తెలియజేసింది.. చాలా కాంప్రమైజ్ కావాలని ఎంతో బలవంత పెట్టే వారని ఆమె తెలియజేసింది.అలాంటి వాటికీ తాను అస్సలు లొంగలేదని నా టాలెంట్ ను నమ్ముకుని ఈ స్థాయికి చేరానని నోరా ఫతేహి తెలియజేసింది.