Suprem Court: మణిపూర్‌లో రెండు జాతుల మధ్య హంస ఇప్పటికీ కొనసాగుతోంది. మణిపూర్‌లో మహిళలపై జరిగిన ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. విచారణ సందర్బంగా దేశంలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, హింసాత్మక ఘటనపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మణిపూర్ హింసపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీజేఐ ప్రశ్నించారు. విచారణ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించిన సీజేఐ.. మరిన్ని వివరాలతో రేపు విచారణకు హాజరు కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. మణిపూర్‌లో మహిళల్ని నగ్నంగా ఊరేగించి.. అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సాగింది. బాధిత మహిళల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. మే 3వ తేదీ నుంచి ఇప్పటి వరకు అలాంటి ఘటనలపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. మణిపూర్‌లో జరిగిన ఘటనకు చెందిన వీడియో ఒక్కటి వెలుగులోకి వచ్చిందని.. కానీ మహిళల పట్ల వేధింపులకు చెందిన ఎన్నో ఘటనలకు జరుగుతున్నాయని, ఇదొక్కటే ప్రత్యేకమైన ఘటన కాదన్నారు. మహిళల పట్ల జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు చాలా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని, ఇలాంటి అన్ని కేసుల్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని వాదనల సమయంలో సీజేఐ పేర్కొన్నారు.
Read also: Ketika Sharma: ఎద అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ ఈ భామే
ఈ కేసులో సీబీఐ విచారణను బాధిత మహిళలు వ్యతిరేకిస్తున్నట్లు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. కేసును అస్సాంకు బదిలీ చేయడాన్ని కూడా వాళ్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం తరపున ఈ కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసును అస్సాంకు బదిలీ చేయాలని తమ ప్రభుత్వం కోరలేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. మణిపూర్ బయట ఈ అంశంపై విచారణ సాగాలని చెప్పినట్లు తుషార్ మెహతా పేర్కొన్నారు. ఇద్దరు బాధిత మహిళల్లో.. ఒకరి తండ్రి, సోదరుడిని హత్య చేసినట్లు కపిల్ సిబల్ ఆరోపించారు. వారికి చెందిన మృతదేహాలను ఇంకా గుర్తించలేదరి పేర్కొన్నారు. మే 18వ తేదీన ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న తర్వాతే ఆ కేసులో కదలిక వచ్చిందన్నారు. ఈ ఘటనను వ్యక్తిగత ఏజెన్సీ విచారణ చేపట్టాలని ఆయన సుప్రీంను కోరారు. ఈ కేసును సుప్రీంకోర్టు మానిటర్ చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తుషార్ మెహతా సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. ఇప్పటి వరకు 595 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయినట్లు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. విచారణ సందర్భంగా మహిళలపై దాడి జరిగాక ఎఫ్ఐఆర్ నమోదుకు ఎందుకు ఆలస్యం అయిందని సీజేఐ ప్రశ్నించారు. నమోదు అయిన 5 వేల కేసుల్లో… ఏయే కేటగిరిలో ఎన్ని కేసులున్నాయని ప్రశ్నించారు. మొత్తంగా కేసుల్లో ఎందరిని అరెస్ట్ చేశారని..కోర్టుల్లో కేసుల పరిస్థితి ఏమిటనీ సీజేఐ ప్రశ్నించారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళల వీడియోను తాను పరిశీలించానని.. అలాంటివి అక్కడ ఎన్ని జరిగినా ఈ వైరల్ వీడియో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిందన్నారు. మణిపూర్‌లో రెండు వర్గాల్లో బాధితులు ఉన్నారని సీజేఐ అన్నారు. మణిపూర్‌లో నమోదు చేసిన కేసుల్లో ఎన్ని లైంగిక హింస, హత్యకు చెందినవో స్పష్టంగా తెలియదని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టుకు తెలిపారు. రేప్ బాధిత మహిళలు.. మహిళలకు మాత్రమే తమ బాధను చెప్పుకోగలరని, అందుకే హైపవర్ మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె సుప్రీంను కోరారు. మరిన్ని వివరాలతో రేపు విచారణకు హాజరు కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీజేఐ ఆదేశించారు.