సరిగ్గా ఏడాది క్రితం జూన్ 4న చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చాడు.. ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు.. చంద్రబాబు తనను నమ్మిన ప్రజలనే మోసం చేశాడు.. అబద్ధపు హామీలతో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచాడు అని దుయ్యబట్టారు జగన్..
ఏడాది పాలనలో ఏమీ చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడుస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంను వదిలి పెట్టమని, జనాలకు వైసీపీ పార్టీ అండగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చారని.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం పలు పథకాలను తుంగలో తొక్కిందని…
కూటమి ప్రభుత్వం అధికర్మలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా.. ఇచ్చిన హామీలను అమలు చేయాకుండా రెడ్ బుక్ రాజ్యాన్ని నడుపుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క రోడ్డు అయినా కూటమి ప్రభుత్వం వేసిందా? అని ప్రశ్నించారు. కూటమి నేతలు సూపర్ సిక్స్ పక్కనపెట్టి.. సూపర్ స్కామ్‌లు చేస్తున్నారని విమర్శించారు. కూటమి నేతలు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, ఇసుక మాఫియాతో రెచ్చిపొతున్నారన్నారు. చంద్రబాబు వచ్చాక టీడీపీ నేతలకు పదవులు వచ్చాయని, ప్రజల చేతికి మాత్రం చిప్ప…
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలను వారం రోజుల్లోనే విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారని, రీ వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. గతంలో పరీక్షల విధానంలో చిన్న పొరపాట్లు జరిగాయని రామారావు పైన చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చి గాలి ముద్దుకృష్ణమ నాయడును రాజీనామా చేయించారని, ఇప్పుడు నీ కొడుకు (నారా లోకేష్)ను రాజీనామా చేయమని చెబుతారా?…
వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఒక్కసారిగా కుప్పకూలారు. బొత్స అస్వస్థతకు గురవడంతో వైసీపీ నేతలు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బీపీ తగ్గడంతో ఆయన ఇబ్బంది పడ్డారు. గరివిడి నుంచి విజయగరంకు బొత్స బయల్దేరారు. వైసీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. చీపురుపల్లిలోని ఆంజనేయపురం నుంచి స్థానిక మూడురోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో…
Sajjala Ramakrishna Reddy: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించదలచిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు.