ఏపీ హైకోర్టులో వైసీపీ సోషల్ మీడియా నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టింది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల భార్గవ్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.. అయితే... అన్ని పిటిషన్లపై నేడు విచారణ చేసిన ఏపీ హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది.