YCP MP Gorantla Madhav react on His Comments on Nara Chandrababu: తన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించిందని, పద దోషంతో నారా చంద్రబాబు నాయుడుపై ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. చంద్రబాబు రాజకీయంగా చనిపోతారన్నదే తన ఉద్దేశం అని స్పష్టం చేశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ఎంపీ గోరంట్ల ఏంటి ఇలా అనేశారు? అని జనాలు మాట్లాడుకునేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై ఏపీ అంతటా టీడీపీ శ్రేణులు నిరసన జ్వాలలు చేపట్టాయి.
తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2024లో నారా చంద్రబాబు చస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు బస్సు యాత్ర మొదలుపెట్టారు.. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి.. ఢిల్లీ యాత్ర చేశారు. పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టి.. వదిలిపెట్టి పారిపోయే యాత్ర చేస్తున్నారు. ఎవరెన్ని యాత్రలు చేసినా.. జగన్ జైత్రయాత్రను ఆపలేరు. 2024లో జగన్ సీఎం అవుతారు. చంద్రబాబు చస్తాడు’ అని గోరంట్ల హాట్ కామెంట్స్ చేశారు.
Also Read: Kerala Bamb Blast: కేరళలో బాంబు పేలుళ్లు.. ఒకరు మృతి! 20 మందికి తీవ్ర గాయాలు
ఎంపీ గోరంట్ల మాధవ్ వివాస్పద వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా గోరంట్ల స్పందించారు. ‘నా వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించింది. పద దోషంతో నారా చంద్రబాబుపై ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. వాఖ్య నిర్మాణం లోపం వల్ల అలా మాట్లాడాను. చంద్రబాబు రాజకీయంగా చనిపోతారన్నదే నా ఉద్దేశం. 2024 ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు ఖాయం. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ సమాధి అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇంగ్లీష్ మీడియం విద్య జగన్ పుణ్యమే’ అని గోరంట్ల మాధవ్ అన్నారు.