ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు తమ కొత్త మోడల్స్ ను ఆవిష్కరించాయి. అడ్వాన్స్డ్ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్, స్పీడు, రేంజ్ వంటి దుమ్మురేపే ఫీచర్లతో సరికొత్త కార్లను తీసుకొచ్చాయి. ఈవీలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో కంపెనీలన్నీ ఈవీ కార్లను తీసుకొచ్చే పనిలో పడ్డాయి. సింగిల్ ఛార్జ్ తో వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలుండడంతో ఈవీ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవీల వాడకంతో ప్రయాణ ఖర్చులు కూడా తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో అదిరిపోయే పీచర్లతో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Mahindra BE 6:
మహీంద్రా ఇటీవలే కొత్త ఎలక్ట్రిక్ SUV BE 6ను విడుదల చేసింది. ఇది అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహనాలలో ఒకటి. లగ్జరీ ఇంటీరియర్‌లు, అధునాతన టెక్నాలజీ కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 59kWh, 79kWh రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఈ EV పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో సింగిల్ ఛార్జ్ చేస్తే 682 కిమీ, చిన్న బ్యాటరీ ప్యాక్‌తో 535 కిమీ వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.90 లక్షలుగా ఉంది.
Tata Curvv EV:
టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు (Tata Curvv EV) టాటా మోటార్స్ విడుదల చేసిన కొత్త ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.17.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు పరిధి 502 – 585 కి.మీ. టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, వాగ్ వటాగన్, స్కోడా కుషక్, ఎంజీ ఆస్టర్ వంటి కారులకు పోటీగా ఉంటుంది.
Hyundai Creta Electric:
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ను రిలీజ్ చేసింది. క్రెటా EV2 బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఈ EV 42kWh బ్యాటరీతో 390 కిమీ, 51.4kWh బ్యాటరీతో 473 కిమీ పరిధిని అందిస్తుంది. క్రెటా EV ఎక్స్-షోరూమ్ ధర రూ.17.99 లక్షల నుండి రూ.23.50 లక్షల వరకు ఉంటుంది.