Tadipatri: తాడిపత్రిలో భగ్గుమన్న రాజకీయం.. కారు అద్దాలు ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక టీడీపీ నాయకుడు సంజీవరెడ్డి కుమారుడి వివాహ వేడుక తాడిపత్రిలోని ఎస్ ఆర్ టీ ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పెళ్లి వేడుకకు పలువురు కీలక నాయకులు హాజరయ్యారు.
అయితే.. పెళ్లి వేడుకకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ సంజీవరెడ్డి సోదరుడు శ్రీరామ్ రెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని ప్రశ్నిస్తూ, ఆయనను వెంటనే ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
Also Read
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
- Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
- Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై అక్కడే ఉన్న తాడిపత్రి వైఎస్సార్సీపీ నాయకుడు కందిగోపుల మురళి తీవ్రంగా స్పందించారు. “మేమెందుకు బయటకు వెళ్లాలి?” అని ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా అదే ఫంక్షన్ హాల్ లో ఉన్నారు. మంత్రి సమక్షంలోనే నేతల మధ్య మాటల ఈటెలు విసురుకోవడం, వాగ్వాదం జరగడం తీవ్ర కలకలం రేపింది. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోయిన కాసేపటికే ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడమే కాకుండా, గుర్తుతెలియని వ్యక్తులు ఓ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పెళ్లికి వచ్చిన వేడుక ప్రతినిధులు, స్థానికులు తీవ్ర తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాడిపత్రిలో రాజకీయ విభేదాలు మళ్లీ భగ్గుమనడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!