Man Pouring Milk While Spinning Video Shakes Internet: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాదు టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ కూడా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం.
Also Read: Yuvraj Singh Playing XI: యువరాజ్ సింగ్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ XI.. ధోనీకి దక్కని చోటు!
15 సెకన్ల నిడివి గల వీడియోలో ఒక వ్యక్తి కుర్చీపై కూర్చొని పాలను మిక్స్ చేస్తున్నాడు. కూర్చొనే చుట్టూ తిరుగుతూ.. ఓ జగ్‌లో నుంచి మరో జగ్‌లో పాలను పోస్తున్నాడు. చుట్టూ తిరుగుతున్నా.. ఒక్క చుక్క పాలు కూడా కిందపడకుండా ఓ జగ్‌లో నుంచి మరో జగ్‌లో పోస్తున్నాడు. అతడి టాలెంట్‌కు అక్కడున్న వారందరూ ఫిదా అవుతారు. ఇందుకు సంబందించిన వీడియోను ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. ‘ఇది ఒలింపిక్ క్రీడ ఎందుకు కాదు?’ అని ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘ఏం టాలెంట్ భయ్యా’, ‘ఒలింపిక్స్‌కు పంపిస్తే భారత్‌కు పతకం ఖాయం’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Why isn’t this an Olympic sport? pic.twitter.com/HeGP58OZ8Y
— anand mahindra (@anandmahindra) July 13, 2024