Yashasvi Jaiswal: భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ నయా రికార్డ్ సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ భారత మాజీ ఆటగాళ్లు మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున 2500 టెస్ట్ పరుగులు చేసిన నాల్గవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు.
READ ALSO: Mahavatar Narsimha : ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..!
యశస్వి జైస్వాల్ 53 ఇన్నింగ్స్‌లలో 2500 టెస్ట్ పరుగులు పూర్తి చేశాడు. అజారుద్దీన్ తన టెస్ట్ కెరీర్లో 55 ఇన్నింగ్స్‌లలో 2500 పరుగులు చేశాడు. అదే సమయంలో టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్‌లలో అత్యంత వేగవంతమైన 2500 పరుగుల రికార్డ్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు మీద ఉంది. సెహ్వాగ్ కేవలం 47 ఇన్నింగ్స్‌లలో తన కెరీర్లో 2500 పరుగులు పూర్తి చేశాడు. రెండవ స్థానంలో గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గంభీర్ 48 ఇన్నింగ్స్‌లలో 2500 టెస్ట్ పరుగులు పూర్తి చేశాడు.
టెస్ట్ మ్యాచ్‌లో 2500 పరుగుల రికార్డ్ ..
47 ఇన్నింగ్స్‌లు – వీరేంద్ర సెహ్వాగ్
48 ఇన్నింగ్స్‌లు – గౌతమ్ గంభీర్
50 ఇన్నింగ్స్‌లు – రాహుల్ ద్రవిడ్
53 ఇన్నింగ్స్‌లు – యశస్వి జైస్వాల్
55 ఇన్నింగ్స్‌లు – మహ్మద్ అజారుద్దీన్
56 ఇన్నింగ్స్‌లు – సునీల్ గవాస్కర్
56 ఇన్నింగ్స్‌లు – సచిన్ టెండూల్కర్
సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్..
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేశాడు. టెస్ట్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ 56 ఇన్నింగ్స్‌లలో 2500 పరుగులు చేయగా, జైస్వాల్ 53 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులు మాత్రమే చేసి జైస్వాల్ ఔటయ్యాడు. వాస్తవానికి రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జైస్వాల్ కేవలం 20 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేశాడు.
READ ALSO: Rekha Gupta: ఢిల్లీలో సీఎం రేఖ గుప్తాకు తొలి అగ్ని పరీక్ష .. బీజేపీ ప్లాన్ ఏంటి?