Mahavatar Narsimha : సినీ ప్రంపచంలో సంచలనం సృష్టించిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా. అప్పటి వరకు ఇండియాలో యానిమేషన్ మూవీ పెద్దగా ఆడదు అనుకుంటున్న టైం లో మహావతార్ నరసింహా దుమ్ము లేపింది. అశ్విన్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను హోం బలే సంస్థ రూ.40 కోట్లతో నిర్మించింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ తో నేషనల్ వైడ్ గా అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయింది. లాంగ్ రన్ లో ఈ సినిమా రూ.325 కోట్ల దాకా వసూలు చేసింది. ఎన్నో రికార్డులు సృష్టించిన మహావతార్ నరసింహా ఇప్పుడు మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ రేసులో నిలిచింది.
Read Also : Akhanda 2 : ఇద్దరు సీఎంలను రంగంలోకి దించుతున్న బాలయ్య..?
తాజాగా రిలీజ్ చేసిన లిస్టులో మహావతార్ పేరు కూడా ఉంది. యానిమేషన్ కేటగిరిలో 35 సినిమాలు ఆస్కార్ నామినేషన్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ సినిమాల లిస్టులో మహావతార నరసింహా కూడా ఉంది. ఈ 35 సినిమాల నుంచి ఒక సినిమాను నామినేషన్స్ కోసం పంపిస్తారు. ఒకవేళ మహావతార్ గనక సెలెక్ట్ అయితే ఇండియా నుంచి నామినేషన్స్ కు వెళ్లిన మొట్టమొదటి యానిమేషన్ మూవీగా చరిత్ర సృష్టిస్తుంది. నామినేషన్స్ దాకా వెళితే అవార్డు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
Read Also : Andhra King Taluka : భాగ్య శ్రీతో డేటింగ్ పై స్పందించిన రామ్ పోతినేని