ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియాలో మునిగితేలుతోంది. ప్రపంచంలో ఏ మూలన ఈ విషయం జరిగిన నిమిషాలలో ఆ విషయం కాస్త ప్రపంచం నలుమూలల ఇట్టే తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తరచు చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు ఇలా కొన్ని ఆహార పదార్థాలకు సంబంధించిన వీడియోలో వైరల్ గా మారుతున్నాయి. మరి కొందరైతే ఫుడ్ బ్లాగర్స్ అంటూ రకరకాల ఆహార పదార్థాలను చూపిస్తుంటారు. ఇకపోతే తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also read: Actor Naresh: పవన్ టార్చ్ బేరర్.. చెడు చెవిలో చెప్పుకుందాం అంటూ నరేష్ ట్వీట్
ఇక వైరల్ గా మారిన వీడియోలో ఓ కొత్త రకం వంటను పరిచయం చేశారు. బ్లూ కలర్ లో ఉండే ఆహార పదార్థాలు సరికొత్త షేడ్ తో మన కంటికి నింపుగా కనిపిస్తూ మనల్ని ఆకర్షిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్లూ కలర్ రైస్ సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తాజాగా ఓ ఇంస్టాగ్రామ్ యూజర్ బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్ ను ఉపయోగించి కొత్తరకం వంటను పరిచయం చేశాడు. ముందుగా బట్టర్ ఫ్లై పీ ఫ్లవర్స్ ను శుభ్రం చేసి వాటి రెక్కలను వేరు చేసిన తర్వాత వాటిని వేడి నీటిలో పోసి మరిగించి ఆ తర్వాత అందులోంచి ఆకులను మాత్రం బయటికి తీసేసి బ్లూ రంగులో ఉండే నీటిలో రైసును వేసి ఉడికిస్తాడు. దాంతో అన్నం మొత్తం నీలిరంగుగా మారిపోతుంది. ఆ తర్వాత దానిపై నెయ్యితో కాస్త డెకరేషన్ కూడా చేస్తాడు. ఆ తర్వాత ఆ తర్వాత మరో కుండని తీసుకుని అందులో నెయ్యి వేడి చేసి అందులో రకరకాల స్పైసెస్ అలాగే జీడిపప్పు, ద్రాక్ష ఇలా అన్ని సిద్ధం చేసుకుని మసాలాలతో కలిపి బ్లూ రైసును మిక్స్ చేస్తాడు. ఈ పదార్థాలు అన్నింటి కలిపి ‘ బటర్ ఫ్లై పీ గీ రైస్’ ను సిద్ధం చేస్తారు.
Also read: Salman Khan Firing: హోంశాఖకు ముంబై పోలీసుల లేఖ
ఇక ఈ వీడియో కి సంబంధించి నెటిజెన్స్ మిశ్రమ స్పందనను తెలిపేస్తున్నారు. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ కొందరు బాగుందనగా.. మరికొందరు పెదవివిరిచారు. కొందరు నెటిజెన్స్ ఈ కొత్తరకం వంటని అవతార్ బిరియాని అంటుండగా.. మరొకరు ‘ఎమ్ఐ రైస్ ప్లేట్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకరు ఇదే నా చివరి బిరియాని అని ఫీల్ అవుతున్నట్లు తెలపగా.. మరికొందరైతే ‘గాడ్ నేను ఇంకోసారి ఎప్పుడూ ఈ ఫుడ్ ఐటమ్ జోలికి వెళ్ళనంటూ’ కామెంట్ చేస్తున్నారు.