వరల్డ్ కప్ 2023ఫైనల్ లో ఆస్ట్రేలియా గెలిచి ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టైటిల్ పోరులో భారత్ ను చిత్తుగా ఓడించింది. భారత గడ్డపై జరిగిన ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా ఎగురేసుకుపోయింది. మొదట్లో రెండు మ్యాచ్ లు ఓడిపోయి.. ఆ తర్వాత పుంజుకుని అన్నీ మ్యాచ్ల్లో గెలుపొంది. ఇప్పుడు ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ను ఒడిసిపట్టింది.
ఫిఫా ఉమెన్స్ ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో స్పెయిన్ స్పెయిన్ జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారి ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా నిలిచింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 0-1 తేడాతో గెలిచి మొట్టమొదటి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.