పనిమనిషికి సంబంధించిన వింత ఉదంతం ముంబైలో వెలుగులోకి వచ్చింది. చోరీ చేసిన పనిమనిషిని పట్టుకున్న తీరు బాగా వైరల్ అవుతోంది. వాట్సప్ స్టేటస్ దొంగను పట్టించింది. ఈ ఘటనపై యూజర్లు కూడా చాలా చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ముంబైకి చెందిన ఒక జంట రెండేళ్ల క్రితం తమ ఇంట్లో పనిమనిషిని నియమించుకున్నారు. ఇంటి పనులతో పాటు పిల్లలను కూడా చూసుకుంది. అయితే అక్టోబర్ మొదటి వారంలో వ్యక్తిగత కారణాలతో పనిమనిషి ఉద్యోగం మానేసింది. ఎందుకు పని మానేసిందో వాళ్లకి అర్థం కాలేదు. అయితే దుర్గాపూజ సందర్భంగా ఆ గృహిణి తన కొత్త చీర కోసం వెతకగా అది కనిపించలేదు.
READ MORE: IND vs NZ: సొంతగడ్డపై టీమిండియా ఓటమి గల కారణాలు ఇవే..?
పనిమనిషిని పిలిచి అడగ్గా.. ఇస్త్రీ చేసిన తర్వాత.. ఆమె చీరను అల్మారాలో ఉంచిందని చెప్పింది. అయితే సీసీటీవీని పరిశీలించగా.. మహిళ బ్యాగ్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో వారికి అనుమానం వచ్చింది. అయినప్పటికీ వదిలేశారు. కొద్దిరోజుల తర్వాత పనిమనిషి అదే చీరను కట్టుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టింది. అంతేకాకుండా.. తన గడియారాన్ని కూడా ధరించడం కనిపించింది. అనంతరం దంపతులిద్దరూ ఇంట్లోని సామాగ్రిని పరిశీలించగా నగదుతోపాటు నగలు, వాచీలు, చీరలు, కళ్లద్దాలు, బట్టలు, మేకప్ కిట్ కూడా మాయమైనట్లు గుర్తించారు. ఇంటి నుంచి సుమారు రూ.2.5 లక్షలు దోచుకున్నట్లు సమాచారం. పనిమనిషిపై దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
READ MORE: Bangladesh: భారత్ షేక్ హసీనాని అప్పగించాలి, లేదంటే.. బంగ్లాదేశ్ వార్నింగ్..