Woman Kidnapped Married Boyfriend: మరో పెళ్లి చేసుకున్న ప్రియుడు.. కిడ్నాప్ చేసి తాళికట్టించుకున్న ప్రియురాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Woman Kidnapped and Married Boyfriend: తన ప్రియురాలికి ఏదైనా ఆపద ఎదురైతే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడుకుంటాడు ప్రియుడు. ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి నిశ్చయం అయితే.. లేచిపోయైనా సరే పెళ్లి చేసుకునేందుకు వెనకాడరు. ఇందుకు యువతులు కూడా అతీతులు ఏమీ కాదు. తాజాగా ఓ యువతి తను ప్రాణానికంటే అమితంగా ప్రేమించిన వాడు మరొకరిని పెళ్లి చేసుకోవడం భరించలేక పోయింది. ఏకంగా తన ప్రియుడిని కిడ్నాప్ చేసి.. బలవంతంగా తాళి కట్టించుకుంది. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
చెన్నై వేళచ్చేరికి చెందిన పార్తిబన్ (31) ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. గత జూలైలో ప్రియ అనే అమ్మాయిని పార్తిబన్ పెళ్లి చేసుకున్నాడు. ప్రియ కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. అయితే పార్తిబన్ పెళ్లికి మందు రాణిపేటకు చెందిన సౌందర్యను ప్రేమించాడు. చదువుకునే రోజుల్లో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఏడేళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
పార్తిబన్ పెళ్లి విషయం తెలుసుకున్న సౌందర్య అతడిని మర్చిపోలేకపోయింది. అతన్నే వివాహం చేసుకుంటానని తన తల్లి, బంధువులతో చెప్పింది. ఇక చేసేదిలేక సౌందర్యకు ఆమె తల్లి ఉమ అండగా నిలిచింది. తల్లి ఉమ.. బంధువులు రమేష్, శివ కుమార్‌ల సాయంతో పార్తిబన్‌ను కిడ్నాప్ చేసేందుకు ప్రణాళిక వేసింది. శుక్రవారం ఎప్పటిలాగానే ఆఫీస్ వెళ్లేందుకు పార్తీబన్ కారు ఎక్కాడు. ఇంతలో ఓ ముఠా హఠాత్తుగా వచ్చి కారులో ఉన్న పార్తిబన్‌ను కిడ్నాప్ చేశారు. ఇది చూసిన పార్తిబన్ తల్లి కారును ఆపేందుకు ప్రయత్నించగా.. అతివేగంతో ఆమెను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
Also Read: Sunday Good Luck Remedies: ఆదివారం నాడు ఈ చర్యలు చేస్తే.. వ్యాపారంలో విజయం! ఊహించని డబ్బు మీ సొంతం
కిడ్నాప్ ముఠా పార్తిబన్‌ను నేరుగా కాంచీపురంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ సౌందర్య మెడలో బలవంతంగా తాళి కట్టించారు. విషయం తెలుసుకున్న పార్తీపన్ భార్య ప్రియ వెలాచ్చేరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలిలోని సీసీ కెమెరా ఫుటేజి ఆధారంగా నిందితులను గుర్తించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఓ ఇంట్లో పార్తిబన్ ఉన్నట్లు గుర్తించారు. ఇంట్లో ఉన్న పార్తిబన్ మాజీ ప్రియురాలు సౌందర్య, ఆమె బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!