Mumbai: ముంబైకి ఆనుకుని ఉన్న మీరారోడ్‌లోని నయానగర్ ప్రాంతంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో లివింగ్ రిలేషన్ షిప్ లో జీవిస్తున్న ఓ వ్యక్తి తన మహిళా భాగస్వామిని హత్య చేయడమే కాకుండా పలు ముక్కలుగా నరికేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మహిళా భాగస్వామిని ముక్కలుగా నరికి పారవేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు మృతదేహంలోని అనేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
Read Also:KTR: నేడు మహబూబ్‌నగర్‌కు కేటీఆర్.. జడ్చర్లలో 560 డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభం
నిందితుడి పేరు మనోజ్ కాగా, బాలిక పేరు సరస్వతి అని డీసీపీ జయంత్ బజ్బలే తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఇంట్లో విచారణలో మహిళ పాదాలు మాత్రమే లభించాయి. మహిళ శరీరంలోని మిగిలిన భాగాలను వేరే చోట పారవేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మహిళ శరీరాన్ని ఎన్ని ముక్కలుగా నరకాడో పోలీసులకు అర్థం కావడం లేదు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి విచారణ కొనసాగుతోంది.
Read Also:Lack of PhD: ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్‌డీల కొరత
గతంలో కూడా శ్రద్ధవాకర్ హత్య ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. శ్రద్ధ, అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడిని ప్రేమించింది. వారిద్దరి ప్రేమను తల్లిదండ్రులు తిరస్కరించడంతో ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్లిపోయారు. అక్కడ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ ఉన్నారు. కాగా కొంతకాలం తర్వాత తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో శ్రద్ద వాకర్‌ను అఫ్తాబ్ అతికిరాతకంగా 35 ముక్కులుగా నరికి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పడేశాడు. ఆరు నెలల తర్వాత బయటపడిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.