ఒకవైపు ఎండల వేడి కారణంగా చల్లబడడానికి మందుబాబులు భారీగా వైన్ షాపుల ముందు వేచి చూస్తుండగా.. వరుస బంద్ లతో వాటిని మూసేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో వారికి గట్టి షాక్ తగిలింది. గత నెల రోజుల నుండి పలు కారణాలతో మద్యం దుకాణాలు మూసివేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా జూన్ 4 వ తేదీన ఎన్నికల కౌంటింగ్ కారణంగా మరోసారి మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని లోక్సభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Maruti Suzuki : కార్ల ధరలు మరింత తగ్గించిన మారుతీ సుజుకీ
ఏప్రిల్ నెల నుండి ఇలా మద్యం దుకాణాలు తరచుగా మూసేస్తున్న సంఘటనలు చాలానే జరిగాయి. ఏప్రిల్ నెలలో రెండు రోజులపాటు మద్యం దుఖాణాలు మూసివేయబడ్డాయి. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17 న హైదరాబాద్ జంట నగరాల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అలాగే ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా కూడా మరోసారి మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అలాగే ఎలక్షన్ టైం లో కూడా మే నెలలో మద్యం దుకాణాలు బంద్ అయిన సంగతి తెలిసిందే.
Kidney Stone: ఈ నియమాలు పాటించండి.. కిడ్నీలో రాళ్లు తొలగేలా చేయండి