మద్యం ప్రియులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్...హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు 24 గంటల పాటు మూతపడనున్నాయి. నగరంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్‌లలో ఆదివారం పూర్తిగా మూతపడనున్నాయి. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన నగరంలోని వైన్స్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున వాడవాడలా రామనామ స్మరణ మార్మోగుతున్న నేపథ్యంలో.. నేడు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.
ఒకవైపు ఎండల వేడి కారణంగా చల్లబడడానికి మందుబాబులు భారీగా వైన్ షాపుల ముందు వేచి చూస్తుండగా.. వరుస బంద్ లతో వాటిని మూసేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో వారికి గట్టి షాక్ తగిలింది. గత నెల రోజుల నుండి పలు కారణాలతో మద్యం దుకాణాలు మూసివేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా జూన్ 4 వ తేదీన ఎన్నికల కౌంటింగ్ కారణంగా మరోసారి మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని లోక్సభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు…